Indian Foods: ఫారెన్ వీధుల్లో ఇండియన్ రుచులు.. తినాలంటే ఈ రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే..
ఇండియన్ రుచులను తినాలంటే.. విదేశాల్లో ఉన్న వారి పరిస్థితేంటి? ఇంట్లో వండుకోలేరు. బయట రెస్టారెంటుకు వెళ్లినా ఈ మెనూ దొరకదు. అయితే సిడ్నీలో ఉంటున్న భారతీయుల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు కొన్ని రెస్టారెంట్లు ముందుకొచ్చాయి.ఇండియాలోని..
భారతీయులలో చాలా మందికి పొద్దున్నే మసాలా దోశ.. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ.. డిన్నర్లో బటర్ నాన్, మసాలా దట్టించిన కర్రీ.. మెజార్టీ ఇండియన్స్కు ఇలాంటి మెనూ ఉండాల్సిందే. వాటి రుచి నాలుకకు తగలాల్సిందే. లేకపోతే ఎంత తిన్నా ఆకలి తీరని అనుభూతి ఉండనే ఉంటుంది. అలా ఉంటాయి మన భారతీయుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు. ఇండియాలో అయితే పర్వాలేదు.. కానీ విదేశాల్లో ఉన్న వారి పరిస్థితేంటి..? ఇంట్లో వండుకోలేరు. బయట రెస్టారెంటుకు వెళ్లినా ఈ మెనూ దొరకదు. అయితే సిడ్నీలో ఉంటున్న భారతీయుల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు కొన్ని రెస్టారెంట్లు ముందుకొచ్చాయి. ఇండియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి ఈ రెస్టారెంట్లు. సిడ్నీలో అలాంటి ఫుడ్ ఐటెమ్స్ అందిస్తున్న కొన్ని రెస్టారెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- పింకీ జీ: సిడ్నీలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్ జాబితాలోకి పింకీ జీ కొత్తగా చేరింది. ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ జెస్సీ సింగ్. చిన్ చిన్ రెస్టారెంట్ మాజీ చెఫ్ జాన్ జే మెనూకు కొన్ని మార్పులు చేసి రుచికరమైన ఫుడ్ మెనూ అందుబాటులోకి తెచ్చింది ఈ పింకీ జీ రెస్టారెంట్. కొన్ని డిషెస్‌కు ఈస్టర్న్ ఏషియన్ ట్విస్ట్ కూడా ఇచ్చింది. పానీ పూరికి ‘బాల్స్ ఆఫ్ హ్యాపీనెస్’ అని పేరు పెట్టి మెనూలో చేర్చింది రెస్టారెంట్ యాజమాన్యం. నోరూరించే క్రాబ్ కర్రీ, స్వీట్ కార్న్ ప్యూరీ పింకీ జీ రెస్టారెంట్ స్పెషాలిటీ.
- చట్కాజ్: సిడ్నీలోని స్ట్రీట్ ఫుడ్ ప్రియుల ఫేవరెట్ రెస్టారెంట్ చట్కాజ్. అమ్మ చేతి వంటను మరిపించే ఈ వెజ్ రెస్టారెంట్ అన్ని రకాల స్నాక్ ఐటెమ్స్‌ను తన మెనూలో చేర్చింది. ఖమన్, డోక్లా, పాప్డీ చాట్, కర్రీ రోల్ కాంబో, పావ్ భాజీ తదితర ఫుడ్ ఐటెమ్స్‌ను కస్టమర్లకు అందిస్తున్న ఈ రెస్టారెంట్.. వీటితో పాటు జిలేబీ, బర్ఫీ, గులాబ్ జామూనలతో స్వీట్స్ క్రేవింగ్స్‌ను అందుబాలులో ఉంచి కస్టమర్ దేవుళ్లను సంతృప్తి పరుస్తోంది.
- ఫారిన్ రిటర్న్: సిడ్నీలోని సర్రీ హిల్స్ క్రౌన్ స్ట్రీట్‌లో ఉన్న ఫారిన్ రిటర్న్ రెస్టారెంట్.. ఇండియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాల రుచిని ఆ నగరవాసులకు చూపిస్తోంది. వెజ్, నాజ్ వెజ్ వంటకాలతో జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంది ఈ ఫారిన్ రిటర్న్ రెస్టారెంట్. కాలానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇక్కడ దొరికే బాదల్ జామ్ ఎగ్ ప్లాంట్ అపిటైజర్, మలబార్ ఫిష్ కర్రీ, స్మోక్డ్ చిల్లీ చీజ్ నాన్‌కు మస్త్ డిమాండ్ ఉంది.
- డోంట్ టెల్ ఆంటీ: వెజ్, నాన్ వెజ్ ఇండియన్ మెనూతో భోజన ప్రియులను అలరిస్తున్న మరో రెస్టారెంట్ డోంట్ టెల్ ఆంటీ. ఇక్కడ దొరికే ఇండియన్ ఫుడ్ ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ క్యూ కట్టాల్సిందే. తందూర్‌లో కాల్చిన సాల్మన్ ఫిష్ అయినా కుండలో సర్వ్ చేసే చనా మసాలా అయినా వెజ్, నాజ్, వేగన్ ప్రియులు వీటి రుచికి ఫిదా అవ్వాల్సింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు దొరికే బ్రంచ్లో చెఫ్ స్పెషల్ మెనూతో పాటు ప్రీమియమ్ వైన్స్, బీర్స్ అందుబాటులో ఉంటాయి.
- బిల్లూస్: సిడ్నీ హారిస్ పార్క్లోని లిటిల్ ఇండియాలో ఉన్న ఫేమస్ రెస్టారెంట్ బిల్లూస్. నార్త్ ఇండియా క్యూసీన్కు ఫేమస్ అయిన ఈ రెస్టారెంట్లో వెరైటీ వెజ్, నాజ్ వెజ్ డిషెస్ సర్వ్ చేస్తారు. ఇక్కడి వాతావరణం డిన్నర్ డేట్స్‌కు అనువుగా ఉండటంతో పాటు టెర్రస్‌పై చిన్న చిన్న పార్టీలు చేసుకునేందుకు కూడా వెసలుబాటు ఉంది.
- నాట్ జస్ట్ కర్రీస్: బర్త్ డే డిన్నర్స్‌కు పర్ఫెక్ట్ ప్లేస్ ఈ నాట్ జస్ట్ కర్రీస్. తాజా మసాలాలు ఉపయోగించి ఇక్కడ వండే వంటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. బటర్ చికెన్ అయినా మటన్ రోగన్ జోష్ అయినా లొట్టలేయాల్సిందే. ఇక వెజ్ విషయానికొస్తే గోబీ మంచూరియా, ఆలూ టిక్కీ చాట్ చాలా మంది ఫేవరెట్ డిషెస్.
- అభీస్: సిడ్నీలో 25 ఏళ్లుగా భోజన ప్రియులకు రుచికరమైన ఆహారం అందిస్తోంది అభీస్ రెస్టారెంట్. మాస్టర్ చెఫ్ కుమార్ మహాదేవన్‌కు చెందిన ఈ రెస్టారెంట్ టేస్టీ ఫుడ్‌తో పాటు రిలాక్సింగ్ అట్మాస్ఫియర్‌కు పాపులర్. భారతీయ సంప్రదాయ వంటకాలకు కొత్తదనాన్ని జోడించి అందిస్తున్న ఈ రెస్టారెంట్ నిత్యం రద్దీగా ఉంటుంది.
- అర్బన్ తడ్కా: ఫ్లేవర్ ప్యాక్డ్ మెనూతో ఫుడ్ టేస్ట్ చేసిన ప్రతిసారి ఓ కొత్త అనుభూతిని ఇచ్చే రెస్టారెంట్.. అర్బన్ తడ్కా. ఇండియన్ ట్రెడిషనల్ డిషెస్ నుంచి కస్టమర్లు కోరుకున్న విధంగా టేస్టీ ఫుడ్ ఐటెమ్స్ అందిస్తుంది ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నోరూరించే ఆహార పదార్థాలతో డైనింగ్ ఎక్స్పీరియెన్స్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేస్తుంది. సిడ్నీలోని ఇండియన్ వెడ్డింగ్స్ క్యాటరర్స్‌లో మోస్ట్ పాపులర్ అర్బన్ తడ్కా.
- మంజీత్స్: ఫ్యామిలీ లంచ్ అయినా, రొమాంటిక్ డిన్నర్ అయినా సిడ్నీవాసులకు గుర్తొచ్చేది మంజీత్స్. ఇండియన్ రీజినల్ క్యూసీన్స్ అందించే ఈ రెస్టారెంట్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో లంచ్ ఆఫ్షన్ కోరుకునే వారికి మంజీత్స్ $34.99 లకే ఎక్స్ ప్రెస్ లంచ్ బాంక్వెట్ అందిస్తోంది. మైక్రో సమోసాలు, మటన్ రోగన్ జోష్, 1950నాటి మంజీత్స్ బటర్ చికెన్, దాల్‌తో కూడిన ఈ లంచ్ టేస్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- ఇందూ: సిడ్నీలోని ఏంజిల్ ప్లేస్‌లో ఉన్న ఇందూ రెస్టారెంట్ సౌత్ ఇండియా, శ్రీలంక వాతావరణాన్ని గుర్తు తెస్తుంది. ఈ రెస్టారెంట్ కస్టమర్లకు దోశ, ఇడియప్పంతో పాటు కోస్టల్ ఏరియా వంటకాలను కూడా రుచి చూపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..