Coffee and Kidney: కిడ్నీ రోగులకు కాఫీ అమృతంగా పనిచేస్తుందట.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో మూత్ర‌పిండాలు దెబ్బ తిన్నాయ‌ని లాస్ట్ స్టేజ్ వ‌ర‌కు గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా..

Coffee and Kidney: కిడ్నీ రోగులకు కాఫీ అమృతంగా పనిచేస్తుందట.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..
Coffee For Kidney Patients
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 07, 2023 | 2:15 PM

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో మూత్ర‌పిండాలు దెబ్బ తిన్నాయ‌ని లాస్ట్ స్టేజ్ వ‌ర‌కు గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా ఉన్నారు. అందువ‌ల్ల‌నే కిడ్నీల‌ ఆరోగ్య ప‌రిస్థితిని మొద‌టే ప‌సిగ‌ట్టి త‌గిన జాగ్రత్త‌లు తీసుకుంటే ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుద‌ల చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది కిడ్నీల ప‌నితీరును కొంత వ‌ర‌కు సరిచేస్తుంది. అందువ‌ల్ల కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

అలాగే కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల వారు ఆ వ్యాధుల‌తో చ‌నిపోయే అవ‌కాశాలు కూడా 25 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయట‌. అంటే ఆ మేర జీవ‌న కాలం పెరుగుతుంద‌ని అర్థం. ఇక కాఫీ తాగ‌డం వ‌ల్ల ప‌లు ఇత‌ర లాభాలు కూడా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీని రోజూ తాగ‌డం అల‌వాటు చేసుకుంటే ప‌లు వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. శ‌రీరంలో నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే గుణం కాఫీలోని కెఫీన్‌కు ఉంటుందట‌. కాఫీని తాగ‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని, ర‌క్త నాళాలు మృదువుగా మారి, చ‌క్క‌గా ప‌నిచేస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కాఫీ తాగడం వ‌ల్ల మెద‌డు కూడా యాక్టివ్‌గా మారుతుంది. ఎన్‌సీబీఐ ప‌రిశోధ‌కులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం.. నిత్యం 3 క‌ప్పు కాఫీ తాగితే 65 శాతం వ‌ర‌కు మ‌తిమ‌రుపు వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది. కాఫీని రోజూ తాగడం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని కూడా ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ కాఫీ మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని వారు అంటున్నారు. క‌నుక ఇంకెందుకాల‌స్యం.. వెంట‌నే వేడి వేడిగా ఒక క‌ప్పు కాఫీ లాగించేయండి మ‌రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..