AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Benefits: ఇంత చిన్న జీడిపప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే మతి పోవాల్సిందే..

మన ఆరోగ్యాన్ని కాపాడడంలో డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని నిత్యం మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అందుకోసం అవసరమైతే మన జీవన విధానాలను, ఆహారపు అలవాట్లను..

Cashew Benefits: ఇంత చిన్న జీడిపప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే మతి పోవాల్సిందే..
Cashews Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 07, 2023 | 1:11 PM

Share

మన ఆరోగ్యాన్ని కాపాడడంలో డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని నిత్యం మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అందుకోసం అవసరమైతే మన జీవన విధానాలను, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా తప్పనిసరి. కాలంతో సంబంధం లేకుండా డ్రైఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఎంతో ముఖ్యమైనది. జీడిపప్పులో లభించే పోషకాలు ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని పోషకాల నిధి అని పిలుస్తారు. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడమే కాక కాళ్ల నొప్పులు దూరమవుతాయి. జిడిపప్పులో కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు ఆరోగ్య నిపుణులు.

అయితే జీడిపప్పును తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే. జీడిపప్పును సరైన మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే జీడిపప్పు మనకు మేలు చేస్తుంది. జీడిపప్పులో కొవ్వును తగ్గించడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉండటంతో గుండెకు మేలు కలుగుతుంది. జీడిపప్పును తక్కువ మొత్తంలోనే తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. జీడిపప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మనం తినే ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

జీడిపప్పులను కూరల్లోనే కాకుండా వివిధ వంటల్లో కూడా చేర్చుకోవడం ఉత్తమం. జీడిపప్పులో ఒమేగా 3 అల్ఫా లినోలెనిక్ ఆమ్లం ఉండటం వల్ల దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో జీవక్రియ మెరుగుపడుతుంది. జీడిపప్పులో ఉండే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మేలు కలిగిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. జీడిపప్పులో అధిక సాంద్రత కలిగించే లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు రక్షణ కలిగిస్తాయి. జియాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

అతినీలలోహిత కిరణాల ఫిల్టర్ గా ఇవి పనిచేస్తాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం వల్ల మన రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. జీడిపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో మెగ్నిషియం ఉండటం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చేస్తుంది. జీడిపప్పులు మధుమేహులకు లాభం కలిగిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉంటాయి. జీడిపప్పులను తగిన మోతాదులో తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us