AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children’s Health: చలికాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.. మీరు ఇచ్చే ఈ ఆహారమే వారికి శ్రీరామ రక్ష..

చలికాలంలోనే పిల్లల రోగనిరోధక శక్తి క్షీణించి వారి ఆరోగ్యం సన్నగిల్లుతుంది. ఫలితంగా వారు చురుకుగా కాకుండా నిరసంగా ఉండడంతో పాటు అనేక సీజనల్ సమస్యలకు లోనవుతుంటారు. ఇక పిల్లలు సరైన..

Children's Health: చలికాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.. మీరు ఇచ్చే ఈ ఆహారమే వారికి శ్రీరామ రక్ష..
Nutritional Foo For Children In Winter Season
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 07, 2023 | 8:19 AM

Share

చలికాలం అంటేనే అనేక ఆరోగ్య సమస్యలు. యువకులను సైతం వణికిస్తున్న ఈ శీతాకాలపు వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ కాలంలోనే పిల్లల రోగ నిరోధక శక్తి క్షీణించి వారి ఆరోగ్యం సన్నగిల్లుతుంది. ఫలితంగా వారు చురుకుగా కాకుండా నిరసంగా ఉండడంతో పాటు అనేక సీజనల్ సమస్యలకు లోనవుతుంటారు. ఇక పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బ్యాక్టీరియా, జెమ్స్‌తో పోరాడే రోగనిరోధక శక్తిని కోల్పోతుంటారు. పిల్లలైనా, పెద్దలైనా చలికాలంలో సరైన డైట్‌ను పాటించడం చాలా ముఖ్యం. అంతేకాక ఆహారపు అలవాట్లలో కొన్ని రకాల మార్పులు చేయడం తప్పనిసరి కూడా.

చలికాలంలో జలుబు, దగ్గు వంటి రోగాలతో పోరాడటానికి పిల్లల పోషకాహారాల విషయంలో తల్లితండ్రులు మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో పిల్లలకు కావలసిన పోషకాలను అందించగలిగే ఆహారాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆకు కూరలు: శీతాకాలంలో ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. పాలకూర, మెంతికూర, ఉల్లి కాడలు, తాజా వెల్లులిని పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల వారికి ఎక్కువ మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్లు, మినరాల్స్‌ను అందించవచ్చు. పరాటాలు, సూప్స్ ద్వారా పిల్లలకు ఆహారాన్ని వేడి వేడిగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆకు కూరలతోపాటు పప్పు కూడా తినిపించండి. దానివల్ల మరిన్ని ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.

ఇవి కూడా చదవండి

పండ్లు: శీతాకాలంలో పిల్లలు పండ్లను ఎక్కువగా తినరు. దీనివల్ల పిల్లల్లో విటమిన్ల లోపం తలెత్తే అవకాశం ఉంది. చలికాలంలో దొరికే పండ్లు ఎక్కువ పోషకాలను కలిగి వుంటాయి. నారింజ, దానిమ్మ, ఉసిరి.. విటమిన్ -C, ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని బూస్ట్ చేయడంతో పాటు శరీరంలో యాంటీఆక్సిడెంట్ల సంఖ్యను పెంచుతాయి. పిల్లలు చలికాలంలో పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి కలర్ ఫుల్  బౌల్‌లో వివిధ రకాల పండ్లను, కట్ చేసి పిల్లలకు స్నాక్స్‌గా ఇచ్చేయండి.

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి పిల్లలకు శక్తిని అందించడమే కాక జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మీ పిల్లలు ఖర్జురాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు తినేలా మీరు జాగ్రత్త వహించండి. అలాగే పాలు కూడా ఇవ్వండి. ఎందుకంటే పాలు చలికాలంలో పిల్లలను వెచ్చగా వుంచడంలో సహాయపడతాయి. పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ను కలిపి మీ పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు.

స్వీట్ పొటాటోస్: చలి కాలంలో ఎక్కువగా తీపి లేదా శరీరాన్ని వెచ్చబరిచే ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాం. స్వీట్ పొటాటోస్ విటమిన్ A, పొటాషియం, బీటా కారోటీన్, కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని ఉడికించి.. తొక్క తీసి చాట్ మసాలాతో అందించిన లేదా ఫ్రై చేసి పిల్లలకు అందించినా మంచిదే. దీనివల్ల పిల్లల్లో మెటబాలిజంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

తేనె: తేనె అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సహజంగానే తీపిని కలిగి ఉండటం వల్ల చక్కెరకు బదులుగా తేనేను వాడుతుంటారు కొందరు. తేనె ఫైటోకెమికల్స్‌, ఫ్లేవనాయిడ్లును ఎక్కువగా కలిగి ఉంటుంది. తేనెతో దగ్గు, గొంతునొప్పిని తగ్గించవచ్చు. చాక్లెట్ సిరప్‌లకు బదులు పిల్లలకు తేనేతో చేసిన కేకు లేదా మఫిన్లను అందిస్తే ఇష్టంగా తింటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి