బలమైన ఎముకల ఎదుగుదలకు మెగ్నీషియం, కాల్షియం ఎంతో సహకరిస్తాయి. కాల్సిటోనిన్ అనే హార్మోన్ వృద్ధికి ఇది చాలా అవసరం. ఇది ఎముకల నిర్మాణాన్ని సంరక్షించడానికి మృదు కణజాలం నుంచి, రక్తం నుంచి ఎముకలకు కాల్షియంను అందిస్తుంది. పిల్లల ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే గోధుమలు, క్వినోవా, బాదం, వేరుశనగ, పచ్చి ఆకు కూరలు, నల్ల చిక్కుళ్ళు వంటివి చేర్చండి.