- Telugu News Photo Gallery Cricket photos Jhye richardson hamstring injury in bbl out for 2 3 weeks mumbai indians ipl 2023
IPL 2023: ముంబై ఇండియన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రూ. 1.50 కోట్ల బౌలర్.. ఐపీఎల్ ఆడేనా?
గత నెల వేలంలో ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Updated on: Jan 06, 2023 | 9:20 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఐదుసార్లు ఛాంపియన్ ముంబైకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తర్వాత మరో కొత్త ఆటగాడు గాయపడ్డాడు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్ గాయం కారణంగా బిగ్ బాష్ లీగ్‌కు దాదాపు పూర్తిగా దూరమయ్యాడు. పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న ఈ స్పీడ్‌స్టర్ మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోయాడు.

పెర్త్ కోచ్ ఆడమ్ వోజెస్ మాత్రం రిచర్డ్‌సన్ గాయం అంత తీవ్రంగా లేదని, అతను గరిష్టంగా 3 వారాల పాటు టోర్నీకి దూరంగా ఉంటాడని చెప్పాడు. పెర్త్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే రిచర్డ్‌సన్ ఫిట్‌గా ఉండవచ్చని వోజెస్ చెప్పుకొచ్చాడు.

రిచర్డ్‌సన్ ఈ సీజన్‌లో పెర్త్ తరపున రాణించి 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.

రిచర్డ్‌సన్ గాయపడ్డాడన్న వార్త ముంబైని కాస్త టెన్షన్‌లో పడేసింది. గత నెలలో జరిగిన వేలంలో రిచర్డ్‌సన్‌ను రూ.1.50 కోట్లకు ఎంఐ కొనుగోలు చేసింది. అయినప్పటికీ, వోజెస్ ప్రకటన కొంత ఉపశమనం కలిగించి ఉండాలి. కానీ, ఇప్పటికీ రిచర్డ్‌సన్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మైదానంలోకి తిరిగి వస్తాడా, ఐపీఎల్ మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉంటాడనే విషయంపై స్పష్టత లేదు.




