క్యాన్సర్ , హెచ్ఐవీ, అధికరక్తపోటు, టీబీ వంటి వ్యాధులను తగ్గించుకునేందుకు వాడే మందులు కూడా తిమ్మిర్లు వచ్చేలా చేస్తాయి. అదేవిధంగా హెపటైటీస్ బీ, సీ, లైమ్ డిసీజ్ వంటి కొన్నిరకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు నరాలను దెబ్బతీయడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోయినట్లయితే కూడా తిమ్మిర్లు కనిపిస్తాయి. జన్యుపరమైన రుగ్మత వల్ల కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నరాలపై ట్యూమర్లు పెరుగుతున్న సందర్భాల్లో, థైరాయిడ్ సమస్యతో ఉన్నవారిలో, అలాగే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిర్లు కనిపిస్తాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..