Gluten-free foods: బరువు తగ్గాలనుకుంటుకుంటే.. మీ ఆహారంలో ఈ చిన్న మార్పును చేయండి.. ఆపై ఫలితాలతో ఆశ్యర్యపోవాల్సిందే..

గ్లూటెన్ ఉన్న ఆహారాల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని ప‌లువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లూటెన్ వల్ల గ్యాస్, అసిడిటీ, డ‌యేరియా, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు నొప్పి, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, డిప్రెష‌న్ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని..

Gluten-free foods: బరువు తగ్గాలనుకుంటుకుంటే.. మీ ఆహారంలో ఈ చిన్న మార్పును చేయండి.. ఆపై ఫలితాలతో ఆశ్యర్యపోవాల్సిందే..
Gluten Free Foods
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 06, 2023 | 3:12 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా స్థూలకాయం, ఒబెసిటీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. క్రమరహిత జీవనశైలి, యోగా, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా మంది బరువు పెరుగుతున్నారు. కొందరు వ్యక్తులు కడుపు ఉబ్బరం సమస్యతో కూడా పోరాడుతున్నారు. ఎటువంటి శ్రమ లేకుండా బరువు తగ్గడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. అందుకు బదులుగా మీరు గ్లూటెన్ రహిత ఆహారాలను తింటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. అవును నిజమే.. రోజువారీ ఆహారంలో గ్లూటెన్ రహిత ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా వేగవంతంగా బరువు తగ్గవచ్చు.

అలాగే గ్లూటెన్ ఉన్న ఆహారాల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని ప‌లువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లూటెన్ వల్ల గ్యాస్, అసిడిటీ, డ‌యేరియా, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు నొప్పి, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, డిప్రెష‌న్ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని నిపుణుల మాట. అంతేకాక గ్లూటెన్ లేని ఆహారం ఉదరకుహర వ్యాధి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇది పోషకాల శోషణను ప్రభావితం చేసే వ్యవస్థ.  అందువల్ల గ్లూటెన్ లేని ఆహారాన్ని తీసుకోవడమే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. మరి అలాంటి పరిస్థితుల్లో గ్లూటెన్ రహిత ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లూటెన్ లేని ఆహారాలు:

  1. బియ్యం: మనకు అనేక విధాలుగా ఉపయోగపడే ధాన్యాలలో బియ్యం ప్రథమమైనవని చెప్పుకోవచ్చు. బియ్యానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి గ్లూటెన్ లేని ధాన్యం. అందుకే అన్నం తినేవారు తొందరగా బరువు పెరగరు. బయట లభించే చిరుతిళ్ల కారణంగానే బరువు పెరుగుతారు.
  2. తాజా మాంసం: తాజా లేదా ప్రాసెస్ చేయని మాంసం గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు నిరభ్యంతరంగా తాజా మాంసం తినవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. తాజా చేప: అన్ని రకాల చేపలు అంటే తాజా, ఎండిన, కాల్చినవి గ్లూటెన్ రహితంగానే ఉంటాయి.
  5. బుక్వీట్: నిజానికి బుక్వీట్ అనేది పుష్పించే మొక్క విత్తనం. ఇది సహజంగానే గ్లూటెన్ రహితంగా ఉంటుంది, అయితే గోధుమలు, బార్లీతో కూడా కొన్ని బుక్వీట్ ఉత్పత్తులు తయారు అవుతున్నాయని గుర్తించాలి. కాబట్టి అలాంటి ఉత్పత్తులను కొనే ముందు నిజమైనవా కాదా అని తనిఖీ చేయాలి.
  6. వెన్న, కూరగాయ నూనెలు: నెయ్యి సహా వెన్న, వంట నూనెలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి.
  7. గుడ్లు: గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడమే కాక అనేక రకాల పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే వీటిని పోషకాహార పవర్‌హౌస్‌లుగా చెప్పుకుంటారు.
  8. గింజలు, విత్తనాలు: గింజలు, విత్తనాలు ఇంకా అన్ని పప్పులు సహజంగా గ్లూటెన్ లేనివి.
  9. మిల్లెట్: మిల్లెట్స్ గ్లూటెన్ రహితంగా ఉంటాయి. అందుకే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బజ్రాను పెద్ద మొత్తంలో వినియోగిస్తారు. మిల్లెట్‌లో మంచి మొత్తంలో ప్రోటీన్, డైటరీ ఫైబర్ మరియు బి విటమిన్లు ఉంటాయి. గోధుమ పిండికి బదులు మిల్లెట్ పిండిని ఆహారంలో చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!