Yoga Benfits: ఈ నాలుగు యోగాసనాలతో ఒత్తిడి సమస్యకు గుడ్ బై.. మీరూ ట్రై చేసి చూడండి

ఒత్తిడి గురైన సందర్భంగా కొన్ని యోగసనాలు వేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా అనేది చికిత్స కాదని సమస్య తీవ్రంగా ఉంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే యోగా వల్ల సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు.

Yoga Benfits: ఈ నాలుగు యోగాసనాలతో ఒత్తిడి సమస్యకు గుడ్ బై.. మీరూ ట్రై చేసి చూడండి
Yoga
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2023 | 6:48 PM

మారుతున్న కాలంలో ఒత్తిడి సమస్య అందరినీ వేధిస్తుంది. తేలికపాటి ఒత్తిడి కావచ్చు..లేదా తీవ్రమైన సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కావచ్చు..టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వారి వరకూ అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూలు, ప్రతి నెలా జీతం వచ్చిన సందర్భం, భవిష్యత్ కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు వంటి విషయాల్లో చాలా మంది ఒత్తిడి గురవుతారు. మిడిల్ ఏజ్ వాళ్లయితే కుటుంబ సమస్యలు, ఉద్యోగం పని విషయాల సమయంలో ఒత్తిడికి గురవుతారు. అయితే ఇలా ఒత్తిడి గురైన సందర్భంగా కొన్ని యోగసనాలు వేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా అనేది చికిత్స కాదని సమస్య తీవ్రంగా ఉంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే యోగా వల్ల సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడడానికి నిపుణులు సూచించే యోగాసనాలపై ఓ లుక్కెద్దాం

బాలాసనం

మీరు ముందుగా కాళ్లను మడిచి మోకాళ్లపై కూర్చోవాలి. అనంతరం యోగా పొజిషన్ లో ఉన్నప్పుడు మీ చేతులను మోకాళ్ల మీదుగా వెనుకనున్న పాదాలను పట్టుకోవాలి. అనంతరం తలను ముందుకు వంచి మోకాళ్ల మీదుగా నేలకు ఆనేలా ఉంచి కాసేపు అలాగే ఉండాలి. అనంతరం తర్వాత అదే పొజిషన్ లో చేతులను ముందుకు చాపి ఉంచాలి. ఇలా వీలైనన్ని ఎక్కువ సార్లు చేయాలి.

బద్దకోనాసనం

ముందుగా యోగా మ్యాట్ పై కూర్చోవాలి. కాళ్లను ముందుకు పాదాలను అభిముఖంగా పెట్టి మన దగ్గరకు తీసుకువచ్చి నమస్కరిస్తున్నట్లుగా నేలపై పెట్టాలి. అనంతరం మనం చేతులతో పాదాలను పట్టుకుని ధ్యానం చేయాలి. ఇలా ఎంతసేవపు వీలైతే అంతసేపు ఉంటే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

శవాసనం

చూడడానికి పడుకున్నట్లు ఉన్నా ఈ ఆసనం వల్ల చాలా ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మన వీపు భాగం నేలకు అనేలా పడుకోవాలి. అర చేతులను ఫ్రీ గా వదిలేయాలి. అలాగే పాదాలను ఫ్రీ ఉంచి నిద్రావస్థలోకి వెళ్లి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ ఆసనం చేయడానికి కూడా సులువుగా ఉంటుంది, అలాగే అద్భుత ఫలితాలు పొందవచ్చు.

ఉత్తనాసనం

ముందు మనం నిటారుగా నుంచోవాలి. అనంతరం ముందుకు వంగి తలను మోకాళ్ల మీదుగా కాళ్ల మధ్యకు వచ్చేలా ఉంచాలి. తర్వాత చేతులతో కాళ్లను పట్టుకుని, స్లోగా వెనక్కి పెట్టి మడిమలను పట్టుకోవాలి. ఈ పొజిషన్ వీలైనంత సేపు ఉండాలి. ఈ ఆసనం కూడా ఒత్తిడి సమస్య నుంచి బయటపడడానికి దివ్యఔషధంలా పని చేస్తుందని నిపుణుల వాదన.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..