Gastric Problem: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జనాలు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. సరైన తిండి లేక, సమయానికి నిద్ర లేకపోవడంతో.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు మెడిసిన్స్‌పై ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే, యోగా నిపుణుల ప్రకారం.. కొన్ని యోగాసనాలు గ్యాస్ట్రిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెడతాయంటున్నారు. మరి ఆ యోగాసనాలేంటో ఇప్పుడు చూద్దాం..