- Telugu News Photo Gallery Sonali Phogat murder Case: These photos were shared by Sonali Phogat few hours before her death
Sonali Phogat Murder: మరణానికి కొన్ని గంటల ముందు సొనాలి ఫొగాట్ నెట్టింట షేర్ చేసిన ఫొటోలు..
హర్యానాకు బీజేపీ లీడర్, బిగ్ బాస్ ఫేమ్, టిక్-టాక్ స్టార్ అయిన సోనాలి ఫొగాట్ గోవాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సోనాలి ఫొగాట్ మృతి అందరినీ కలచివేసింది. ఆమె గుండెపోటుతో మరణించిందని తొలుత భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు మాత్రం అందుకు భిన్నంగా..
Updated on: Sep 04, 2022 | 6:09 PM

హర్యానాకు బీజేపీ లీడర్, బిగ్ బాస్ ఫేమ్, టిక్-టాక్ స్టార్ అయిన సోనాలి ఫొగాట్ గోవాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సోనాలి ఫొగాట్ మృతి అందరినీ కలచివేసింది. ఆమె గుండెపోటుతో మరణించిందని తొలుత భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. మరణానికి కారణం గుండెపోటు కాదు ఆమెకు బలవంతంగా విషం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఐతే సోనాలి ఫొగాట్ మరణానికి కొన్ని గంటల ముందు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తలపై పింక్ తలపాగా ధరించి ఉన్న ఫొటోలు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా సోనాలి ఫొగాట్ ఎప్పటికప్పుడు తన సొంత విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉండేవారు.

సోనాలి ఫొగాట్ భర్త సంజయ్ ఫొగాట్ కూడా 2016లో హర్యానాలోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.




