- Telugu News Photo Gallery You will get amazing results for Body Fitness and Weight Lose if you follow these routines daily
Fitness Tips: నెల రోజుల్లో ఫిట్ అండ్ స్లిమ్‌గా మారాలనుకుంటున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Fitness Tips: కొత్త ఏడాది మొదలై ఇప్పటికే ఐదు రోజులు పూర్తవబోతున్నాయి. మరి ఈ ఏడాదిలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి..స్థూలకాయం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫిటనెస్ మాత్రమే కాదు.. స్లిమ్‌నెస్ కూడా మీ సొంతం. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 06, 2023 | 7:00 AM

ప్రతి రోజూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. క్రమం తప్పకుండా రోజూ ఈ పద్ధతి ఫాలో కావాలి. కావాలంటే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

అదే పనిగా కూర్చుని ఉంటే బరువు పెరగడం ఖాయం. రోజూ కనీసం ఓ అరగంట వాకింగ్ లేదా జాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని కేలరీలు కరుగుతాయి. ప్రతిరోజూ ఇలా చేస్తే బరువు తగ్గడం ఖాయం.

షుగర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడదు. ఒకవేళ బరువు తగ్గించుకోవాలనుకుంటే.. స్వీట్స్ నుంచి దూరంగా ఉండాలి. బంగాళదుంప, బియ్యం కూడా తగ్గించాలి. వీటికి ప్రత్యమ్యాయంగా కేలరీలు తక్కువగా ఉండి పోషక విలువలుండే ఆహారాన్ని తీసుకోండి.

ఫిట్‌నెస్ కోసం ముఖ్యంగా కావల్సింది ఆరోగ్యవంతమైన డైట్. ప్రతిరోజూ ఆయిలీ, ఫ్రైడ్, మసాలా లేదా జంక్ ఫుడ్స్ తినే అలవాటుంటే ఇవాళే వాటికి చెక్ పెట్టండి. చెక్ పెట్టినంత సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. ఫ్యాట్ కారక పదార్ధాలు వదిలిపెడితే చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గించుకునేందుకు జిమ్ వెళ్లడమే ముఖ్యం కాదు. ఫిజికల్ వర్కవుట్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రతిరోజూ 30-40 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తే చాలు సులభంగా బరువు తగ్గవచ్చు.





























