- Telugu News Photo Gallery Technology photos Know here the specifications Price and More of New Kia Model EV9 an Electric Vehicle to be Debut In India Q1 2022
Kia EV9 Specs: కొత్త కార్ కొనాలనుకుంటున్నారా..? అయితే కొంచెం ఆగి ఈ ఈవీ కారుపై ఓ లుక్కేయండి..
Kia EV9: భారత్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే రాబోతున్న కార్లలో కియా కార్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రెడిషనల్ కార్లకు బదులుగా కొత్త కంపెనీ, కొత్త మోడల్ కార్లను కోరుకునేవారి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో కియా కార్లు ముందుంటున్నాయి.
Updated on: Jan 06, 2023 | 8:05 AM

Kia EV9: భారత్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే రాబోతున్న కార్లలో కియా కార్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రెడిషనల్ కార్లకు బదులుగా కొత్త కంపెనీ, కొత్త మోడల్ కార్లను కోరుకునేవారి దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో కియా కార్లు ముందుంటున్నాయి.

Kia EV9 కారు 77.4kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. Kia EV6 కారులో ఉన్నదాని కంటే ఈ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దది. ఈ SUV కార్ ఒక్క చార్జ్‌తో దాదాపు 540 కిమీల మైలేజీ ఇస్తుందని అంచనా.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు డిజైన్లలో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా కొత్తదనం ఉట్టిపడేలా Kia EV9 కార్లలో ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో హెడ్‌లైట్స్‌ని ఏర్పాటు చేశారు.

Kia EV9 కారు 4,929mm పొడవు, 2,055mm వెడల్పు, 1,790mm ఎత్తుతో ఎస్‌యూవి కార్లలో భారీ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. తాము ప్రవేశపెడుతోన్న కియా ఈవీ9 కారు ఎస్‌యూవీ కార్లలో మోన్‌స్టర్‌లా కనిపిస్తుందని కియా కంపెనీ చెబుతోంది.

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ కార్ల మయం కావడంతో ఫ్యూచర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని కియా ప్రవేశపెడుతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిలే ఈ కియా ఈవీ9.

త్వరలోనే ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరగనున్న ఆటో ఎక్స్‌పోలో కియా కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది..

కొత్తగా కారు కొనాలనుకునే వారు.. అందులోనూ ఈవీ కారు కొనాలనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్ అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్.





























