- Telugu News Photo Gallery Business photos Get Apple iPhone SE 2022 just in 5990 rupees only with this Flipkart Offer for more details check here
iPhone SE 2020: కేవలం రూ.5990 లకే ఆపిల్ ఐఫోన్ మీ సొంతం.. ఫ్లిప్‌కార్ట్ అద్దిరిపోయే ఆఫర్.. త్వరపడండి..
ఆపిల్ ఐఫోన్‌లను దాదాపుగా అందరూ ఇష్టపడుతారు. కానీ వాటి అధిక ధరల వల్ల కొందరే ఐఫోన్లను సొంతం చేసుకోగలరు. మరి మిగిలినవారు చూస్తూ సంతోషిస్తుంటారు. అలాంటి వారి కోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ iPhone SE 2020పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.
Updated on: Jan 20, 2023 | 2:13 PM

ఆపిల్ ఐఫోన్‌లను దాదాపుగా అందరూ ఇష్టపడుతారు. కానీ వాటి అధిక ధరల వల్ల కొందరే ఐఫోన్లను సొంతం చేసుకోగలరు. మరి మిగిలినవారు చూస్తూ సంతోషిస్తుంటారు. అలాంటి వారి కోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ iPhone SE 2020పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.

ఐఫోన్ SE 2020 ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. దాదాపు ఐఫోన్ 11 ప్రో మాక్స్ తరహా ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశముంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అద్భుతమైన ఆఫర్‌లను వినియోగించుకుని ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ SE 2020ని కేవలం రూ.11490కి కొనుగోలు చేయవచ్చు.

iPhone SE 2020 డిస్కౌంట్: ఐఫోన్ SE 2020 స్మార్ట్‌ఫోన్ 64GB వేరియంట్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39900గా ఉంది. అయితే ఈ ఫోన్‌పై లైవ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ ధరను కేవలం రూ.28990గా పేర్కొంది. ఇక్కడ ఇకామర్స్ కంపెనీ భారీగా 27 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను వినియోగించుకుంటే iPhone SE 2020 ధర మరింత తగ్గుతుంది.

iPhone SE 2020 ఎక్స్‌చేంజ్ ఆఫర్: ఐఫోన్ SE 2020 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకుంటే ధర భారీగా తగ్గుతుంది. వినియోగదారులు ఐఫోన్ SE 2020 కొనుగోలుపై పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అయితే కొనుగోలు చేసే ముందు పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ మీ ప్రాంతంలో వర్తిస్తుందో? లేదో? తనిఖీ చేసుకోవాలి. ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్.. ఎక్స్ఛేంజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ మోడల్, దాని కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్‌లను వర్తింపజేసిన తర్వాత iPhone SE 2020 ఫోన్‌ను కేవలం రూ.5990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 128GB వేరియంట్‌కు ఈ ఆఫర్‌లు వర్తిస్తాయి. ఈ మోడల్‌ను అతి తక్కువ ధర రూ.9990కే కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్‌లు: iPhone SE 2020 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఐఫోన్ మీ సొంతమవుతుంది. ఆ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌పై 10 శాతం అంటే రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం అంటే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం అంటే రూ.1500 డిస్కౌంట్ ఉంది. UPI ట్రాన్సాక్షన్‌లపై రూ.250 డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి.





























