- Telugu News Photo Gallery Technology photos Hyundai Ioniq 5 Electric Suv Unveiled In India and Bookings Open For Rs 1 Lakh
Hyundai Ioniq 5: కొత్త ఈవీ కార్‌తో రాబోతున్న హ్యుందాయ్.. ఒక్క ఛార్జ్‌తో 630 కి.మీ. మైలేజీ.. మరెన్నో అద్భుత ఫీచర్లు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Hyundai Ioniq 5: మార్కెట్లోకి కొత్త కొత్త సరికొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడిక అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుండడంతో SUVలకు ప్రస్తుతం తెగ డిమాండ్ నెలకొంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ మోడల్ SUVని విడుదల చేసింది.అదే హ్యుందాయ్ అయానిక్ 5 (Hyundai Ioniq 5). మరి దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందామా.?
Updated on: Jan 06, 2023 | 3:02 PM

ఇండియా స్పెసిఫికేషన్స్‌తో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ హ్యుందాయ్ అయానిక్ 5 (Hyundai Ioniq 5) అనే కొత్త ఎలక్ట్రిక్ SUV ని భారత్‌లో లాంఛ్ చేసింది. (Source: Hyundai)

హ్యుందాయ్ బ్రాండ్ వెబ్‌సైట్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.లక్షతో బుక్ చేసుకోవచ్చు. (Source: Hyundai)

హ్యుందాయ్ అయానిక్ 5.. హ్యుందాయ్ న్యూ ఎలక్ట్రిక్- గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫాంలో (E-GMP) తీసుకొచ్చింది. (Source: Hyundai)

ఇంటెలిజెంట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌తో ఈ కార్‌ను లాంఛ్ చేసింది. ఫాస్టర్ ఛార్జింగ్, డ్రైవింగ్ రేంజ్ ఇంక్రీజ్ అదనపు ఆకర్షణ. (Source: Hyundai)

కారు లుక్ మాత్రం అదిరిపోయింది. పొడవు 4635 mm, వెడల్పు 1890 mm. ఎత్తు 1625 mm, వీల్ బేస్ 3000 mm. (Source: Hyundai)

ఇక కారు ముందటి, వెనుక భాగంలో పారామెట్రిక్ పిక్సెల్స్ ఉన్నాయి. అంటే.. పారామెట్రిక్ పిక్సెల్ LED హెడ్‌లాంప్స్, టెయిల్‌యాంప్స్ ఉన్నాయి. (Source: Hyundai)

ఫ్లష్ స్టైల్ ఆటోమేటిక్ డోర్ హ్యాండిల్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది హైటెక్ లుక్‌ను ఇస్తోంది. (Source: Hyundai)

R-20 పారామెట్రిక్ పిక్సెల్ డిజైన్ అల్లాయ్ వీల్స్ ఫీఛర్ కూడా ఉంది. (Source: Hyundai)

ఇక కారు ఇంటీరియర్ డిజైన్ అత్యద్భుతంగా ఉంది. (Source: Hyundai)

హ్యుందాయ్ అయానిక్ 5 రూఫ్ డిజైన్ కూడా బాగుంది. (Source: Hyundai)

12.3 ఇంచుల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెవల్ 2 అడాస్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ మోటార్.. 217 బీహెచ్‌పీ, 350 ఎన్ఎం టార్క్ కలిగి ఉంటుంది. 72.6 Kwh బ్యాటరీ ప్యాన్‌ను కంపెనీ ఈ కారులో అమర్చింది. ARAI సర్టిఫైడ్ ప్రకారం చూస్తే.. ఈ కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే.. అంటే సింగిల్ ఛార్జ్‌తోనే ఏకంగా 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. (Source: Hyundai)

కారు ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది Kia ev6 మోడల్ కంటే.. తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. దాని ధర రూ.59.95 లక్షలుగా ఉంది. ఇక హ్యుందాయ్ అయానిక్5 ఎలక్ట్రిక్ SUV ధర రూ.50 నుంచి 55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ అయానిక్ 5 SUVలో.. అదనంగా డ్యూయెల్ జోన్ Climate కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, మంచి సౌండ్ సిస్టమ్, ABS with EBD, ఇంజిన్ పార్కింగ్ బ్రేక్, Disc Brakes, 6 Air bags వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. (Source: Hyundai)





























