Smartphone: న్యూఇయర్‌లో కొత్త ఫోన్ కొంటున్నారా.? రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే..
కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 20 వేలలోపు మీ బడ్జెటా.? అయితే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Jan 05, 2023 | 8:27 PM

Poco X4 Pro 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో పోకో ఎక్స్4 ప్రో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ 5జీ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో సూపర్ అమెఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫొన్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Realme 10 Pro 5G: రియల్‌మీ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఎల్‌సీడీ డిస్‌ప్లే వచ్చిన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

Redmi Note 11 Pro+ 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 19,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

OnePlus Nord CE 2 Lite 5G: వన్‌ప్లాస్ బ్రాండ్ నుంచి బడ్జెట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ధర విషయానికొస్తే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 19,800గా ఉంది.

Moto G72: రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో మోటీ జీ72 ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అమెఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రెయిర్ కెమెరాను అందించారు.





























