AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Mohan : తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు.. ఎలా బయటపడ్డానంటే.. కమెడియన్ బాబు మోహన్ కామెంట్స్..

దశాబ్దాలుగా సినీరంగంలో నటుడిగా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేశారు బాబు మోహన్. కోట శ్రీనివాసరావుతో ఆయన చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. వీరిద్దరి కాంబోకు తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Babu Mohan : తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు.. ఎలా బయటపడ్డానంటే.. కమెడియన్ బాబు మోహన్ కామెంట్స్..
Babu Mohan
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 7:50 PM

Share

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తన జీవితంలోని అనూహ్య సంఘటనలను, సినిమా విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆయన, గత కొద్ది నెలలుగా రాజకీయంగా అంత చురుకుగా కనిపించకపోవడానికి గల కారణాలను, తన నటన ప్రయాణంలోని జ్ఞాపకాలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని వివరించారు. గత కొన్ని నెలలుగా ఆహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం పండ్లు, పండ్ల రసాలు, రాగి జావా వంటి వాటినే తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒకప్పుడు భోజన ప్రియుడినని, మాంసాహారం లేకుండా ఉండలేనని, కానీ ఇప్పుడు చికెన్‌ను చూసినా తినబుద్ధి కావడం లేదని చెప్పారు. ఏదైనా ఒకసారి వద్దు అనుకుంటే, దాని గురించి పెద్దగా పట్టించుకోనని, ఆ అలవాట్లను మానేయగలనని తన బలమైన సంకల్పాన్ని తెలియజేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

రోజుకు 30-35 మిఠా కాకుండా కాశ్మీర్ ఖిమాం జర్దా పాన్‌లను తినే బాబు మోహన్, ఒకసారి సంగారెడ్డిలోని తన నియోజకవర్గం నుండి హైదరాబాద్ వస్తుండగా, ఓ పాన్ షాపులో పాన్ కట్టించుకున్నారు. మెయిన్ రోడ్డు ఎక్కిన తర్వాత పాన్ వేసుకుందామని భావిస్తుండగా, ఉన్నట్టుండి ఎస్పీ నుండి ఫోన్ వచ్చిందని చెప్పారు. బాబు మోహన్ గారు, మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా అని అడగగా అవునని బదులిచ్చానని.. వెంటనే ఎస్పీ, “వద్దు వద్దు తినకండి” అని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. ఆ వెంటనే మరొక ఫోన్ వచ్చిందని. ఒక మహిళ ఏడుస్తూ “సాబ్ పాన్ నై ఖానా, ఉస్ మే జెహెర్ హై” (సార్, పాన్ తినొద్దు, అందులో విషం ఉంది) అని చెప్పిందని అన్నారు.. ఎస్పీ మళ్ళీ ఫోన్ చేసి, సీరియస్‌గా పాన్‌లో విషం ఉందని, వెంటనే పడేయమని చెప్పడంతో ఆ పాన్‌ను పడేశానని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ప్రత్యర్థులు తనను చంపేందుకు పాన్‌లో విషం కలిపారని బాబు మోహన్ వెల్లడించారు. భగవంతుడి దయ వల్లే ఆ ప్రమాదం నుండి బయటపడ్డానని, ఆ సంఘటన తర్వాత పాన్ తినడం పూర్తిగా మానేశానని చెప్పారు. దైవ సంకల్పం తన ప్రాణాన్ని కాపాడిందని, అదే సమయంలో తనకు పాన్ అలవాటు మానేసేలా చేసిందని అన్నారు. అంకుశం సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 10 సినిమాల్లో బుక్ అయ్యానని, దాసరి సినిమాకే డేట్లు లేని పరిస్థితి వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

Follow Us