AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థరాత్రి సర్పంచ్ ఇంటి ముందు క్షుద్రపూజలు.. మార్నింగ్ చూసి కంగున్నతిన్న కుటుంబ సభ్యులు!

జనగామ జిల్లాలో ఓ సర్పంచ్ ఇంటిముందు నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆ సర్పంచ్ ఇంటివద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన నిమ్మకాయలు వదిలేశారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేకే క్షుద్రపూజలు చేసి హతమార్చే కుట్ర జరుగుతుందని బాధిత సర్పంచ్ కుటుంబం ఆరోపిస్తున్నారు

అర్థరాత్రి సర్పంచ్ ఇంటి ముందు క్షుద్రపూజలు.. మార్నింగ్ చూసి కంగున్నతిన్న కుటుంబ సభ్యులు!
Black Magic Rituals
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 22, 2026 | 7:06 PM

Share

ఇటీవల నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన నేత ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంటతండాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుడికుంటతండా సర్పంచ్‌గా ఎన్నకైన భనోత్ మహేందర్ ఇంటి ముందు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మంత్రించిన నిమ్మకాయలు, పసుపు,కుంకుమ,నల్ల నువ్వులు, నల్ల ఆవాలు వదిలేసి వెళ్లారు.

తెల్లవారుజామున ఇంటి వాకిలి ఊడ్చేందుకు వచ్చిన సర్పంచ్ కుటుంబ సభ్యులు ఇంటిముందు క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి ఒక్కాసారిగా షాక్ అయ్యారు. వెంటనే విషయాన్ని సర్పంచ్ మహేందర్‌కు తెలియజేశారు. ఈ ఘటనపై మహేందర్ స్పందిస్తూ తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాటి నుంచి తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని.. తండాకి చెందిన వారే రాజకీయ కక్షతో కుట్రపూరితంగా క్షుద్ర పూజలు చేసి తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇక గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా సర్పంచ్ ఇంటిపై క్షుద్రపూజలు చేయడంతో ఒక్కరిగా తండావాసులు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఇంటిపై క్షుద్ర పూజలతో పాటు సర్పంచ్ ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా చర్చగా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us