AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. రూ.27.65 కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తించింది ఏసీబీ. ఆయనకు 10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అలాగే..

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌
Acb Ride
Subhash Goud
|

Updated on: Jul 22, 2026 | 9:08 PM

Share

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. రూ.27.65 కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తించింది ఏసీబీ. ఆయనకు 10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 2 కిలోల బంగారం, రూ.52 లక్షలు, మూడు కార్లు, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఏసీబీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముత్యం వెంకటరమణ ఇంట్లో 20 మద్యం బాటిళ్లు సైతం లభ్యమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు ముత్యం వెంకటరమణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంతంలో ఉన్న మీనాక్షి స్కై లాంచ్‌ అపార్ట్‌మెంట్‌తో పాటు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రదేశాల్లోనూ ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.

ఈ సోదాల్లో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లాకర్ల సమాచారం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. అక్రమాస్తులు బయటపడిన తర్వాత ఆయనను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us