The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో ‘నో’
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా చేసింది. అయితే నాని సినిమాకు ఈ బ్యూటీ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఒక స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో..

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి షోకే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రెండు రోజులకు కలిపి ఏకంగా 114 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాని జడల్ అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. అలాగే హీరోయిన్ గా కయాదు లోహర్ సుబ్బు అనే పాత్రలో క్యూట్ గా కనిపించింది. వీరితో పాటు మోహన్ బాబు, రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ బాబు, సోనాల్ కులకర్ణి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న ది ప్యారడైజ్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా కయాదు లోహర్ ను ఎంపిక చేయలేదట. వేరొ స్టార్ హీరోయిన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తిరిగి చిత్ర నిర్మాతలు కయాదును ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి మొదటగా సుబ్బు పాత్ర కోసం దర్శక నిర్మాతలు అనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
దేవర సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె రామ్ చరణ్ పెద్ది సినిమా చేసింది. అయితే పెద్దితో పాటు ది ప్యారడైజ్ సినిమా కోసం కూడా జాన్వీని సంప్రదించారు మేకర్స్. అయితే అప్పటికే పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో జాన్వీ కపూర్ నాని ది ప్యారడైజ్ సినిమాను వదులుకుందని తెలుస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు సుబ్బు పాత్ర కోసం కయాదు లోహర్ ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ది ప్యారడైజ్ సినిమాలో కయాదు రోల్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఒక వేళ జాన్వీ గనక ఈ రోల్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ ఎలా ఉండేదోనని సినీ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




