AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Money Horoscope: ఆర్థికంగా ఈ 5 రాశులకు కలిసొచ్చే వారం.. ఆదాయం పెరిగే ఛాన్స్..!

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3, 2026 వరకు 12 రాశుల వారికి ఆర్థికంగా భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి.డబ్బు, ఆదాయం, వ్యాపార లాభాలు, బకాయిల వసూళ్ల పరంగా ఐదు రాశులకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కన్య, సింహం, మిథునం, మకరం, ధనుస్సు రాశుల వారికి ఆదాయ వృద్ధి, అదనపు ఆదాయ అవకాశాలు, పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి రావడం, వ్యాపారంలో లాభాలు వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ ఐదు రాశుల వారికి ఈ వారం ఆర్థికంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి.

Weekly Money Horoscope: ఆర్థికంగా ఈ 5 రాశులకు కలిసొచ్చే వారం.. ఆదాయం పెరిగే ఛాన్స్..!
Money Weekly Horoscope 27 Sep 03 Oct 2026
Janardhan Veluru
|

Updated on: Sep 26, 2026 | 6:59 PM

Share

ఆర్థిక వారఫలాలు (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3, 2026): గ్రహాల సంచారం ప్రభావంతో 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ముఖ్యంగా ఆదాయం, వ్యాపార లాభాలు, రావాల్సిన డబ్బు చేతికి రావడం, అదనపు ఆదాయ మార్గాలు వంటి ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ఐదు రాశులకు ఈ వారం అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని ఆర్థిక వ్యవహారాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము వసూలు కావడంతో పాటు ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా అందుకు తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సంపద, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభించడం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు సహాయపడే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల ద్వారా ఆదాయంలో మార్పు రావచ్చు.

ఇవి కూడా చదవండి

మిథున రాశి

మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సులభంగా చక్కదిద్దుకోగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందడంతో పాటు వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆదాయ అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు.

మకర రాశి

మకర రాశి వారికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వచ్చినా వాటి ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఉద్యోగం, వృత్తితో పాటు ఆదాయ పరంగా కూడా అనుకూల సమయం. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలు మంచి ఫలితాలను అందించవచ్చు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన రావచ్చు.

Follow Us
Weekly Money Horoscope: ఆర్థికంగా ఈ 5 రాశులకు కలిసొచ్చే వారం..
Weekly Money Horoscope: ఆర్థికంగా ఈ 5 రాశులకు కలిసొచ్చే వారం..
ఎస్‌బీఐలో 207 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ. కోటి ప్యాకేజీ!
ఎస్‌బీఐలో 207 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రూ. కోటి ప్యాకేజీ!
Career Astrology: ఆ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..మీ రాశికి
Career Astrology: ఆ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..మీ రాశికి
మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్
మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన 90స్ కిడ్స్ ఫేవరెట్ మోబైల్
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?