AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arogya Yoga: కీలక గ్రహాల అనుగ్రహం..ఈ రాశుల వారికి ఆరోగ్య భాగ్యం..!

Health Astrology: జ్యోతిష శాస్త్రంలో ఆరోగ్య యోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. జాతక చక్రంలో ఇత రత్రా ఎన్ని రాజయోగాలు, ధన యోగాలున్నా ఆరోగ్యం బాగా లేనప్పుడు వాటిని అనుభవించే అవకాశం ఉండదు. జ్యోతిషశాస్త్రరీత్యా 11వ స్థానం ఆరోగ్య స్థానం. సాధారణంగా రాశినాథుడు లేదా లగ్నాధిపతి బలంగా ఉన్నపక్షంలో అనారోగ్య బాధ ఉండదు. ఒకవేళ అనారోగ్యం పట్టుకున్నా త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా కొన్ని రాశుల వారికి 11వ స్థానాధిపతితో పాటు రాశ్యధిపతి కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వారికి ఆరోగ్య భాగ్యం కలగడం జరుగుతుంది. ఆ రాశులు: మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 3:57 PM

Share
మేషం: ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీద శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్య నియ మాలు ఎక్కువగా పాటిస్తారు. ఈ రాశివారిని బీపీ, చర్మవ్యాధులు, నిద్రలేమి, శిరోభారం, నేత్ర సంబంధమైన సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, రాశ్యధిపతి, లాభ స్థానాధిపతి అనుకూలత వల్ల వచ్చే రెండు నెలల్లో అనారోగ్యాల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. రాశ్య ధిపతి కుజుడు, గురువు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశివారికి ఒకపట్టాన అనారోగ్యాలు దగ్గరకు రావు. వస్తే తొందరగా విడిచిపెట్టవు. సాధారణంగా వీరు ఎక్కువగా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా కొలస్టెరాల్, థైరాయిడ్, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు, శని బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి తీవ్రస్థాయి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవైనా కలిగినా త్వరలో కోలుకోవడం జరుగుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశి తత్వం వల్ల ఈ రాశివారిని తేలికగా అనారోగ్యాలు పట్టుకుంటూ ఉంటాయి. ఎక్కువగా గుండె, ఛాతీ సమస్యలకు ఆస్కారముంటుంది. ఎలర్జీలతో కూడా ఇబ్బందులు పడుతుంటారు. ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడల్లా అనారోగ్యాలతో ఇబ్బందిపడడం జరుగుతుంటుంది. ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటు వంటి అనారోగ్యం నుంచైనా కోలుకుంటారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలేమీ ఉండకపోవచ్చు.

3 / 6
తుల: ఈ రాశివారు సాధారణంగా గుండె, వెన్నముక, ఎముకలు, చర్మ సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. గ్రహ బలం వల్ల వీరు ఎక్కువ కాలం అనారోగ్యాలకు గురయ్యే అవకాశం లేదు. ఒక వేళ ఏదైనా అనారోగ్యం పట్టుకున్నా దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించడం జరుగుతుంటుంది. ఈ రాశిలో రాశ్యదిపతి శుక్రుడు, లాభ స్థానంలో కేతు సంచారం వల్ల అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారు ఎక్కువగా విష జ్వరాలు, అంటువ్యాధులు, డయాబెటిస్, భుజాలు, మోకాళ్లు, ఎముక సంబంధమైన అనారోగ్యాలు, పుండ్లు, కణుతులతో అవస్థలు పడుతుంటారు. అతిగా శ్రమ పడడం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. రాశ్యధిపతి గురువు బలంగా ఉండడంతో పాటు, లాభ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల వీరు అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరు అక్టోబర్ నెలలో పూర్తిగా ఆరోగ్యవంతులు కాగలుతారు.

5 / 6
మకరం: ఈ రాశివారిని ఎక్కువగా చర్మవ్యాధులు, రక్త సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. సాధారణంగా ఈ రాశివారు ఆహార, విహారాల్లో క్రమశిక్షణ పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అందువల్ల ఈ రాశివారు అంత త్వరగా అనారోగ్యాలకు గురికావడం జరగదు. ప్రస్తుతం శని, గురువులు అనుకూలంగా ఉన్నందువల్ల ఎలాంటి అనారోగ్యాల నుంచైనా త్వరలో కోలుకోవడం జరుగుతుంది.

6 / 6
Follow Us