AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపాడు.. ఆసక్తికర విషయం చెప్పిన నటి లయ

ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందిన లయ ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Actress Laya: నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపాడు.. ఆసక్తికర విషయం చెప్పిన నటి లయ
Actress Laya
Basha Shek
|

Updated on: Sep 26, 2026 | 6:37 PM

Share

సావిత్రి, సౌందర్యల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది లయ. వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల పాటు కథానాయికగా రాణించింది. అయితే పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. చాలా ఏళ్ల పాటు అక్కడే ఉన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. తమ్ముడు, సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని, వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్ వంటి సినిమాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సహాయక నటిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న లయ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తన పెళ్లి సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను బయట పెట్టింది.

‘నా పెళ్లి రిసెప్షన్‌కు ఓ పెద్ద డైరెక్టర్‌ని పిలిస్తే ఆయన రాలేకపోయారు. ఇండస్ట్రీలో ఆయనకు చాలా మంచి గుర్తింపు ఉంది. అయితే కొన్ని కారణాలతో ఆయన రాలేకపోవడంతో ఒక గిఫ్ట్‌లా పార్శిల్ పంపించారు. ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి. అందులో ఒక లెటర్ కూడా రాసిపెట్టారు. నేను నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అప్పుడు ఇవ్వలేకపోయాను. నీ పెళ్లి టైంలో అయినా ఇస్తున్నాను. ఇది నా పెళ్లి గిఫ్ట్ అనుకో, దీవెనలు అనుకో అని రాసి ఉంది. ఆ మాటలు చదివి నేను షాకయ్యాను. నేను ఆయనను ఏమీ అడగలేదు. అప్పటికే సినిమా రిలీజై మూడు నాలుగేళ్లు అయిపోయింది. రెమ్యునరేషన్ సంగతి కూడా మర్చిపోయాను. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను, నాతో అసలు పనిలేదు. కానీ ఆయనంతట ఆయనే ఫీలై.. ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదని పంపించడం మంచి విషయమే కదా’ అని లయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. లయకు ఆ డబ్బుల కవర్ పంపిన దర్శకుడు ఎవరబ్బా? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు

ఇవి కూడా చదవండి

అయితే లయ ప్రస్తావించిన ఈ విషయంలోని ఆ ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్ అని తెలుస్తోంది. 2004లో విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వరాభిషేకం’లో లయ హీరోయిన్‌గా చేసింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇవ్వలేకపోయిన మిగిలిన పారితోషికాన్ని.. 2006లో లయ పెళ్లి చేసుకున్న టైంలో పూర్తిగా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

వినాయక చవితి వేడుకల్లో నటి లయ..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
నా పెళ్లికి గిఫ్టుగా ఆ టాలీవుడ్ డైరెక్టర్ డబ్బుల కవర్ పంపారు: లయ
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..