AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?

కొన్ని రోజుల క్రితం చెప్పినట్లే హైపర్ ఆది జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ లాగా కాకుండా ఇకపై పూర్తి స్థాయిలో ఈ షోలో భాగం కానున్నాడీ స్టార్ కమెడియన్. మరి రీఎంట్రీలో అతను ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా?

Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?
Hyper Aadi
Basha Shek
|

Updated on: Jul 22, 2026 | 9:16 PM

Share

ఒకప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ‘జబర్దస్త్’. బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో ఈ షో దూసుకుపోయింది. అయితే కాలక్రమేణా ఈ షో రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా జబర్దస్త్ కు బ్రాండ్ అంబాసిడర్స్ అయిన నాగబాబు, రోజా బయటకు వెళ్లి పోవడం ఈ కామెడీ షోపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆ తర్వాత ఈ షోకు వెన్నెముకగా నిలిచిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, వేణు.. ఇలా ఎంతో మంది టాప్ కమెడియన్లు సైతం ఈ షోకు దూరమయ్యారు. దీంతో జబర్దస్త్ కు పూర్ రేటింగ్స్ వచ్చాయి. అయితే మళ్లీ ఈ కామెడీ షోకు పునఃవైభవం తీసుకొచ్చేందుకు అన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జడ్జీగా నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే సినిమాల వల్ల జబర్దస్త్‌కు దూరమైన స్టార్ కమెడియన్ హైపర్ ఆది మళ్లీ రంగంలోకి దిగాడు. కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ లాగా కాకుండా పూర్తి స్థాయిలో ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నాడు. తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో స్వయంగా ఆదినే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అతని రెమ్యునరేషన్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీకు ఇటీవలే ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఈ షోలో హైపర్ ఆది కూడా ఉన్నాడు. ప్రతీ బుధ , గురువారాల్లో ప్రసారమయ్యే ఢీ షో ఇప్పుడు ముగియడంతో ఆద కాస్త ఫ్రీ అయ్యాడు. ఆ షో కి కేటాయించే డేట్స్ ని ఇప్పుడు జబర్దస్త్ కి కేటాయించాడు. దీనికి తోడు జబర్దస్త్ టైమింగ్స్ ను కూడా పూర్తిగా మార్చేశారు. ఇదివరకు శుక్ర, శనివారాల్లో ప్రసారమయ్యే ఈ కామెడీ షోను ఇప్పుడు ఏకంగా ఆదివారం సాయంత్రానికి మార్చేశారు. స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి ఇది మరింత ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో స్కిట్ కి హైపర్ ఆది 5 లక్షల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ హైపర్ ఆది రీఎంట్రీ ఇస్తే జబర్దస్త్ కు మేలే జరుగుతుంది. రేటింగ్స్ కూడా పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 జబర్దస్త్ లో హైపర్ ఆది..

View this post on Instagram

A post shared by ETV Telugu (@etvtelugu2708)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us