PPF Scheme: అద్భుతమైన స్కీమ్.. ఇందులో పెట్టుబడి పెడితే లక్షాధికారులు కావచ్చు!
మీరు సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసును ఎంచుకోవడం మంచి ఆప్షన్. ఇందులో పెట్టిన పెట్టబడిక సెక్యూరిటీ ఉంటుంది. పోస్టాఫీసులో అలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి..
Updated on: Jan 06, 2023 | 6:05 AM

Post Office Schemes

ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ సంవత్సరానికి 7.1 శాతంవడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. కానీ ఆ తర్వాత దానిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. 15 సంవత్సరాల వ్యవధి ముగిసే సమయానికి మీకు ఫండ్ అవసరం లేకపోతే మీరు దానిని తీసుకెళ్లవచ్చు. ఇది మీకు చక్రవడ్డీ ప్రయోజనాన్ని ఇస్తుంది.


మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీకు రూ.1.50 లక్షలు అవుతాయి. అంటే రోజుకు రూ.416 ఆదా చేసుకోవాలి. అదే సమయంలో 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. దానిపై మీకు వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం ఇవ్వబడుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 40.70 లక్షలు అవుతుంది. ఇందులో రూ. 18.20 లక్షల వడ్డీ ప్రయోజనం లభిస్తుంది.

నెలకు రూ.12,500 చొప్పున 25 ఏళ్లపాటు డిపాజిట్ చేయడం ద్వారా రూ.40.70 లక్షల మొత్తం రెట్టింపు అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం నుండి మాత్రమే వర్తించినట్లయితే, 25 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి మొత్తం రూ.37.50 లక్షలు. వడ్డీ ప్రయోజనంతో రూ. 62.50 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీపై రూ.1.03 కోట్లు అందుతాయి.





























