AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuppintaku Benefits: కుప్పింటాకుతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఈ మొక్క కోసం పరుగులు తీయాల్సిందే..

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో..

Kuppintaku Benefits: కుప్పింటాకుతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఈ మొక్క కోసం పరుగులు తీయాల్సిందే..
Kuppintaku Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 06, 2023 | 3:46 PM

Share

ప్ర‌స్తుత కాలంలో ఆరోగ్య సమస్యలనేవి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసులవారినీ వెంటాడుతున్నాయి. అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే అన్ని రకాల సమస్యలకు డాక్టర్ అవసరం లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అంతేకాక నిత్యం డాక్టర్లు ఇచ్చే మందులను వాడడం శరీరానికి మంచిది కాదంటున్నారు. ఎందుకంటే వాటిలోని రసాయనాలు కొంత కాలం తర్వాత మన శరీర వ్యవస్థపై దుష్పభావాలను చూపే అవకాశం ఉంది. వాటికి బదులుగా ఆయుర్వేదంపై ఆధారపడడం మేలని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ద్వారా కూడా మన ఆరోగ్య సమస్యలను న‌యం చేసుకోవ‌చ్చని వారు అంటున్నారు. అయితే ఈ మందుల‌ను వాడేట‌ప్పుడు ఆయుర్వేద వైద్యుడి ప‌ర్య‌వేక్ష‌ణ ఉండ‌డం చాలా అవ‌స‌రం.

తెలిసి తెలియ‌క ఈ మందుల‌ను వాడితే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు. ఇది ఎటువంటి నేల‌లోనైనా సుల‌వుగా పెరుగుతుంది. రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది.  ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

  1. కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది . అందుకే దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  2. ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుంది. కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుంది.
  5. కళ్ళు ఉప్పు, పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుంది.
  6. రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకం, నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి. విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది.
  7. కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే  పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పని చేస్తుంది. కామెర్లకు కుడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు.
  8. కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు , నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..