AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP: అధిక రక్తపోటును ముందుగానే నిరోధించాలనుకుంటే.. మీరు తప్పక తీసుకోవలసిన ఆహారాలివే..

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని నిరోధించవచ్చు.  రక్తపోటు సమస్య నుంచి బయటపడేందుకు లేదా నిరోధించేందుకు కొందరు ఆహార పదార్థాల్లో ఉప్పును.

High BP: అధిక రక్తపోటును ముందుగానే నిరోధించాలనుకుంటే.. మీరు తప్పక తీసుకోవలసిన ఆహారాలివే..
High Bp
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 06, 2023 | 4:42 PM

Share

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలనేవి వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. ఇందుకు మనం పాటిస్తున్న కొన్ని రకాల ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. అయితే మనల్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. గుండె ధమనులను దెబ్బతీయడం, గుండెకు రక్తం, ఆక్సిజన్ ప్రసరణను తగ్గించడంతోపాటు ప్రసరణ వ్యవస్థపై అధిక రక్తపోటు అనేది ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలతో అనుసంధానమై ఉండే రక్త నాళాలను కూడా అధిక రక్తపోటు దెబ్బతీస్తుంది. హైబీపికి సరైన ట్రీట్‌మెంట్ లేనప్పటికీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో కొన్ని రకాల మార్పులను చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అంతకంటే ముందే ఈ సమస్యను నిరోధించవచ్చు.

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని నిరోధించవచ్చు.  రక్తపోటు సమస్య నుంచి బయటపడేందుకు లేదా నిరోధించేందుకు కొందరు ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకుంటుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు అధిక రక్తపోటును నిరోధించడమే కాక నియంత్రిస్తాయి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ క్రమంలో హైబీపీని నిరోధించగలిగే ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ద్రాక్షపండు, నారింజ, నిమ్మకాయలతో సహా అన్ని రకాల పుల్లని పండ్లు రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి.
  2. చేపలలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి గుండెకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. గుమ్మడికాయ గింజలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ రక్తపోటు తగ్గించే గుణాలను పుష్కలంగా కలిగి వున్నాయి.
  5. బీన్స్, కూరగాయలలోని ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
  6. బెర్రీలు అధిక రక్తపోటును నిరోధించే శక్తి కలిగి వున్నాయి. వీటికి గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించగల సామర్థ్యం వుంది. పిస్తాపప్పులులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇవి కూడా రక్తపోటు స్థాయిని నియంత్రిస్తాయి.
  7. క్యారెట్‌లో ఉండే క్లోరోజెనిక్, కెఫిక్ యాసిడ్‌లు.. రక్త నాళాలను సడలించడం, వాపును తగ్గించడంలో సాయపడతాయి. రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో కూడా ఉపకరిస్తాయి.
  8. టొమాటోలులో పొటాషియం, కెరోటినాయిడ్ పిగ్మెంట్ లైకోపీన్‌తో సహా అనేక పోషకాలలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే  బచ్చలికూరలో నైట్రేట్లు, పొటాషియం, కాల్షియం, పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇవి కూడా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..