Sesame Seeds: ఇంత చిన్న గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? నువ్వులతో కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మహిళల్లో వచ్చే రొమ్ముక్యాన్సర్‌ను నివారించవచ్చు. అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారించవచ్చు. నువ్వులు తినటం వల్ల శరీరంలో పెరుకుపోయిన..
నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే చిన్నప్పుడు నువ్వుల నూనెతో స్నానం చేయించేవారు అమ్మమ్మలు. ఇంకా నువ్వుండలను కూడా మీరు తినే ఉంటారు. ఇక తెల్ల నువ్వులు, నల్ల నువ్వులని రెండు రకాలుగా లభించే నువ్వులను వంటలలో తక్కువగానే ఉపయోగిస్తారు. కానీ స్వీట్స్‌లో వీటి ఉపయోగం విరివిగా ఉంటుంది. అంతేకాక ఈ నువ్వులను నాగుల చవితి నెలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శని దేవునికి కూడా ఈ నల్ల నువ్వులను ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. నువ్వులు ఏ కలర్ లో ఉన్నా కూడా వాటిలో ఉండే పోషకాలు సమానంగా ఉంటాయి. అయితే కేవలం నువ్వులు మాత్రమే కాకుండా నువ్వుల నూనె వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నువ్వుల నూనెలో ఒమెగా6 ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్స్, యాంటీహిస్టమైన్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్ వంటి ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా ఉంటాయి. చాలామంది క్యాల్షియం సమస్యతో బాధపడుతూ దానిని అధిగమించడం కోసం టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివారు నువ్వులను తినడం మంచిది. నువుల్లో 20 శాతం ప్రొటీన్ వుంటుంది. నువ్వుల్లో వుండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వుల్లో ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి.
నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మహిళల్లో వచ్చే రొమ్ముక్యాన్సర్‌ను నివారించవచ్చు. అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారించవచ్చు. నువ్వులు తినటం వల్ల శరీరంలో పెరుకుపోయిన మలినాలను, అనవసరపు కొవ్వును కరిగించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక శరీర నిగారింపుకు చక్కని ఔషధంగా కూడా పనిచేస్తుంది. చర్మ సంబంధిత రోగాలను నయం చేయటంలో ఎంతోబాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటివారు నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మహిళల్లో రక్తహీనతను తగ్గించేందుకు నువ్వులు చక్కగా ఉపయోగపడతాయి. నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..