Garlic For Diabetes: బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారా..? అయితే వెల్లుల్లి ఉందిగా.. దీనిని ఎలా తీసుకోవాలంటే..

తగిన జాగ్రత్తలు పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను టాబ్లెట్లు, కొన్ని ఆయుర్వేద, ఇంటి నివారణలతో

Garlic For Diabetes: బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారా..? అయితే వెల్లుల్లి ఉందిగా.. దీనిని ఎలా తీసుకోవాలంటే..
Garlic
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 06, 2023 | 7:33 PM

ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ లేని ఇళ్లు కనిపించడం అంటే అరుదు. మధుమేహం పెరగడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులే కారణమని చెప్పవచ్చు. మధుమేహం అనేది నయంకాని లేదా చికిత్స లేని దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధికి ఇప్పటికీ నివారణ లేదు. అయితే తగిన జాగ్రత్తలు పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను టాబ్లెట్లు, కొన్ని ఆయుర్వేద, ఇంటి నివారణలతో నియంత్రించవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయినప్పటికీ వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ముఖ్యం. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగుల తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపడం మంచిది. ఈ క్రమంలోనే వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి పోషకాల నిధి: ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, విటమిన్ C, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ , సెలీనియం తదితర మినరల్స్ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహానికి దివ్యౌషధం: వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మాత్రమే కాక టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో కూడా పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

కాగా, హోమోసిస్టీన్ అనే అమినో యాసిడ్ మధుమేహానికి ప్రమాద కారకం. వెల్లుల్లిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల శరీరంలో ఈ సమ్మేళనం పెరుగుతుంది. కాబట్టి వెల్లుల్లిని జాగ్రత్తగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే సరిపోతుంది. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

మరిన్ని హెల్త్  టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..