AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Choking while Eating: మీ పిల్లలు తినేటప్పుడు ఇలా చేస్తున్నారా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణం పోయే ప్రమాదం

ఒక్కోసారి ఏకంగా ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల చిన్నారులు అన్నం లేదా ఏదైనా ఇతర ఆహార పదార్థాలు పొలమారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Choking while Eating: మీ పిల్లలు తినేటప్పుడు ఇలా చేస్తున్నారా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణం పోయే ప్రమాదం
Choking
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 09, 2023 | 1:38 PM

Share

చంటి పిల్లలకు అన్న ప్రాసన అయ్యాక అన్నం తినిపించడం పెద్ద టాస్క్. వారు చేసే అల్లరి పనులన్నీ చూస్తూ..అలాగే వారితో పాటు సరదాగా అల్లరి చేస్తూ ఒక్కో ముద్ద పెడుతూ ఉండాలి. ఇలాంటి సమయంలో వారు ఏం చేసినా మనం ఏమి అనమనే ఉద్దేశం వారికి కలిగినప్పుడు వారు మరింతగా ఆడుకుంటారు. ఒక్కోసారి ఇలాంటి సమయంలో వారికి పొలమారి దగ్గుతుంటారు. అలాంటి సమయంలో మనం వెంటనే దగ్గనివ్వకుండా మంచి నీరు పట్టించి..తలపై చిన్నగా కొడుతుంటారు. అయితే వారు ఆడుకోవడం వల్లే పులమారింది అనుకుంటాం. అది నిజమే..కానీ ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పొలమారిన సందర్భంగా అన్నం మెతుకు, లేదా ఏదైనా ఆహార పదార్థం శ్వాస నాళంలోకి వెళ్తే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల చిన్నారులు అన్నం లేదా ఏదైనా ఇతర ఆహార పదార్థాలు పొలమారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏ సందర్భంలో జరుగుతుంది..

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు ఆడుతూనే అన్నం తింటామని మారాం చేస్తారు. అలాంటి సమయంలో వారి ఇష్టపడింది చేస్తే అన్నం తినేస్తారనే ఆలోచనతో వారిని ఆడుకోడానికి అనుమతిస్తుంటాం. అయితే మన మనస్సులో ఎక్కడో అనుమానం పీకుతూ ఉంటుంది పొలమారితే ఎలా? అని కానీ కాదనలేని పరిస్థితి. చిన్నారులకు పొలమారిన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తింటున్న సమయంలో ఏదైనా గొంతుకు అడ్డుపడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తున్నారు.

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సాధారణంగా పిల్లలకు పొలమారినప్పుడు మనం చాలా కంగారు పడుతుంటాం. అలాంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో? తెలియదని, కాబట్టి చిన్నారులు ఉక్కిరిబిక్కిరైన సందర్భంగా అస్సలు కంగారు పడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పొలమారిన సందర్భంగా వీలైనంతగా దగ్గనివ్వాలి. వారు దగ్గితేనే ఏదైనా ఆహార పదర్థాం శ్వాసనాళంతో చిక్కుకుపోతే వెంటనే బయటపడుతుంది. కాబట్టి వారిని దగ్గనివ్వాలని వైద్యుల అభిప్రాయం. అయితే ఎంత దగ్గినా ఇరుక్కున పదార్థం బయటపడకపోతే వెంటనే అలర్ట్ అయ్యి వైద్య సహాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఉక్కిరిబిక్కిరి ఆపడానికి చిట్కాలు..

  • భుజం కింద, వీపు భాగంలో గట్టిగా కొట్టాలి.
  • పిల్లల పక్కనే పడుకుని తల దగ్గర లైట్ గా తడుతూ ఇరుక్కున్న పదార్థం బయటకు తీసే వారి చర్యకు తోడ్పాటునివ్వాలి.
  • చిన్నారులు దగ్గితే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు.
  • నోట్లో ఏదైనా అడ్డుపడిందేమో చూడాలి కానీ, చిన్నారుల నోట్లో మాత్రం వేలు పెట్టకూడదు.
  • పిల్లల నడుము చుట్టూ చేతులు పెట్టి..బొడ్డు కింద భాగంలో ఓ చేయి, చాతి కింద భాగం ఓ చేయి పెట్టి వారిని ఎత్తుకుని పైకి, కిందకు కుదిపితే ప్రతిఫలం దక్కవచ్చు.
  • ఎన్ని చేసినా ఎలాంటి రియాక్షన్ రాకపోతే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించడం ఉత్తమం.
  • రోగి స్పృహ కోల్పోయినా లేక అపస్మారక స్థితిలోకి వెళ్లినా వెంటనే సీపీఆర్ చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..