Healthy Sleep: సుఖనిద్రకు చిట్కాలు.. పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టినట్లే..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 09, 2023 | 1:03 PM

ప్రస్తుతం అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, టెక్నాలజీ వాడకం వంటి పలు కారణాల వల్ల అనేక మంది దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది నిద్రలేమి, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం వంటి..

Healthy Sleep: సుఖనిద్రకు చిట్కాలు.. పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టినట్లే..
Tips For Healthy Sleep

ప్రస్తుతం అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, టెక్నాలజీ వాడకం వంటి పలు కారణాల వల్ల అనేక మంది దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది నిద్రలేమి, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం వంటి నిద్ర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఉద్యోగ జీవితం కూడా ఇందుకు చెప్పుకోదగిన కారణం. నిజానికి  మన ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో ఎంత హాయిగా నిద్రపోతే మరుసటి రోజు అంత ఉత్సాహాంగా, చురుకుగా ఉంటాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి సమయంలో చాలా మంది నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నిద్ర పట్టక.. పగటిపూట వర్క్ చేసే సయమంలో కునికిపాట్లు పడుతుంటారు.

అయితే సరైన నిద్ర పట్టకపోవడానికి జీవనశైలిలో మార్పులు కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం పనితీరు దెబ్బతింటుందని చెబుతున్నారు. ప్రతి మనిషికి రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల నిద్ర అవరసరం. ఈ నేపథ్యంలోనే ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా సుఖ నిద్ర కోసం కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. వారు తెలిపిన సూచలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  1. పడక గదిలో  18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చల్లని వాతావరణంలో హాయిగా నిద్రపడుతుంది. ఏదైనా శబ్ధం నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకే ఎలాంటి సౌండ్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే చాలా మందికి లైట్లు ఆన్‭లో ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదు. కాబట్టి వాటిని ఆఫ్ చేసి పడుకోవాలి.
  2. ఫోన్లు, ల్యాప్ ట్యాప్‭లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే నిద్రపోయేందుకు గంట ముందు వీటిని దూరంగా పెట్టాలి.
  3. ఇవి కూడా చదవండి

  4. ప్రతి రోజు నిద్ర పోయేందుకు ఒక సమయం పెట్టుకోవాలి. ఇక పడుకునే ముందు కొద్దిసేపు వాకింగ్ చేసినా, బుక్స్ చదివినా మంచిది. అలాగే చర్మ సంరక్షణ కోసం రాత్రి పూట చల్లని నీటితో ముఖం కడుక్కుని పడుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
  5. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా నిద్ర పోయేందుకు కనీసం రెండు, మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. సాయంత్రం సమయంలో కెఫిన్, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి. నిద్ర పోయే ముందు ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే అర్థరాత్రి నిద్రాభంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి భోజనం విషయంలో సమయపాలన అవసరమని గమనించాలి.
  6. సాయంత్రం సమయంలో ఎక్కువగా ఎక్సర్ సైజులు చేయకుండా.. యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే హాయిగా నిద్ర పోయేందుకు ఇవి సహాయ పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu