Brain Food: మీ బ్రెయిన్ ను సూపర్ స్మార్ట్ చేసే ఫుడ్స్ ఇవే.. మీ డైట్ లో తప్పనిసరిగా వీటిని చేర్చుకోండి

అవునండి నిజమే మెదడును ఆరోగ్యంగా, షార్ప్ గా ఉంచడానికి కొన్ని ఆహార పదర్థాలు సాయం చేస్తాయట. వాటిని రోజూ వారి ఆహారంలో తీసుకోవడం ద్వారా మెదడుకు అవి ఒక ఇంధనంలా మారి, ఆలోచించనాశక్తి పెరగడంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతుందని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు.

Brain Food: మీ బ్రెయిన్ ను సూపర్ స్మార్ట్ చేసే ఫుడ్స్ ఇవే.. మీ డైట్ లో తప్పనిసరిగా వీటిని చేర్చుకోండి
Brain Food
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2023 | 4:38 PM

బ్రెయిన్ ఫుడ్స్.. అంటే ఏమిటి? మెదడు కూడా ఆహారం ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? అవునండి నిజమే మెదడును ఆరోగ్యంగా, షార్ప్ గా ఉంచడానికి కొన్ని ఆహార పదర్థాలు సాయం చేస్తాయట. వాటిని రోజూ వారి ఆహారంలో తీసుకోవడం ద్వారా మెదడుకు అవి ఒక ఇంధనంలా మారి, ఆలోచించనాశక్తి పెరగడంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతుందని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. ఇంతకీ ఆ బ్రెయిన్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..

పండ్లు, కూరగాయలు ముఖ్యం..

సాధారణంగా మనం ఏదైనా సూపర్ మార్కెట్ కు వెళ్లామనుకోండి.. ఆ సమయంలో మనకు ఆకలి వేస్తే ఏం చేస్తాం? అక్కడ ఉన్న ప్యాక్ చేసి ఉంచిన ఏదో పదార్థాలు తీసుకొని తినేస్తాం. అయితే అవి మెదడు ఆరోగ్యానికి అంత మంచివి కాదని నిపుణులు చెబుతున్నారు. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచేందుకు మీ వంటగదిలో ఈ పండ్లు, కూరగాయలు ఎప్పుడూ ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బెర్రీలు, బీన్స్.. బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచడంలో సాయపడతాయి. పండిన బెర్రీలు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి (ఫ్రిజ్‌లో కూడా) వాటిని త్వరగా తినేలా చూసుకోండి. బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు కూడా ఆరోగ్యకరమైన, చవకైన పదార్థాలు. వీటిలో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పండ్లు, కూరగాయలు.. అన్ని రకాల కూరగాయాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెదడుకు ప్రయోజనకరమైన పోషకాలు దండిగా ఉంటాయని సూచిస్తున్నారు. అలాగే పండ్లలో కూడా యాపిల్స్, పైనాపిల్స్, కివీస్, సిట్రస్ తీసుకోవడం మంచిది. అయితే ద్రాక్ష, మామిడి వంటి తీపి పండ్లను అతిగా తినకుండా ఉండటం మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించి తీసుకోవాలి. ఏదైనా మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే , ముందుగా మీ వైద్యుడిని సంప్రదించాలి.

ప్రోటీన్లు.. మీ మెదడు బాగా పనిచేయడానికి అవసరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభించే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. లీన్ పౌల్ట్రీ, సీఫుడ్, గుడ్లలో ఇవి ఎక్కువగా లభిస్తాయి.

గింజలు, విత్తనాలు.. వీటిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వులు, నూనెలు ఉంటాయి. ఇవి మీ మెదడును పదును పెట్టడంలో సహాయపడతాయి. బ్రెజిల్ గింజలలో సెలీనియం వంటి కీలకమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. అవిసె, చియా, జనపనార వంటి విత్తనాలు కూడా మంచి ఎంపికలు. వీటిని స్నాక్‌గా లేదా సలాడ్ లేదా వెజిటబుల్ సైడ్ డిష్‌లో కలిపి రోజూ పావు కప్పు లేదా రెండు ఔన్సులు తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

ఫైబర్ అధికంగా ఉండేవి.. ఆరోగ్యానికి ఫైబర్ చాలా అవసరం. మీ బరువును సమతుల్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. పులియబెట్టిన ఆహార పదార్థాల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధ గుణాలుంటాయి.

నూనెలు.. శరీరంలో కొవ్వులను అదుపు చేయాలంటే ఆలివ్ ఆయిల్, అవకాడోలు వినియోగిస్తే మంచిది.

ఒమేగా అధికంగా.. మెదడు ఆరోగ్యాన్ని పెంచే ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, మాకేరెల్ , ట్యూనా వంటి చేపలలో అధికంగా లభిస్తాయి. అలాగే చియా విత్తనాలు, బ్రస్సెల్స్ మొలకలు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో కూడా ఒమేగా-3లు పుష్కలంగా ఉంటాయి.

డెయిరీ.. పాల ఉత్పత్తులైన పెరుగు, కేఫీర్‌లను ప్రోబయోటిక్ కల్చర్‌ ఉంటాయి. ఇవి తింటే మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ప్రోటీన్‌లు జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చూస్తుంది. అలాగే పసుపు, నల్ల మిరియాలు, కుంకుమపువ్వు, ఎరుపు మిరియాలు రేకులు, ఒరేగానో , రోజ్మేరీ వంటి సుగంధ ద్రవ్యాలు మీ మెదడుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..