AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: ఆరోగ్యానికే కాదు… అందానికి కూడా నెయ్యి దివ్యౌషధం.. ఎలా వాడాలో తెలుసా..?

ఇది మీ చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా మచ్చలు, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలను తొలగిస్తుంది. దీనితో మీరు మృదువైన, మెరిసే చర్మం పొందుతారు.

Skin Care: ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా నెయ్యి దివ్యౌషధం.. ఎలా వాడాలో తెలుసా..?
Ghee On Face
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2023 | 5:40 PM

Share

పాల నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థమే నెయ్యి.. దీనిని వంటలలో, పూజాది కార్యక్రమాలలో ఎక్కువగా వాడుతుంటారు. వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. నెయ్యి మీ ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. చాలామందికి భోజనంలో నెయ్యి లేనిదే ముద్ద గొంతు దిగదంటారు. అలాంటి నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. అంతే కాదు, నెయ్యి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే నెయ్యి వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని మీకు తెలుసా? మెరిసే ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందడానికి నెయ్యిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా మచ్చలు, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలను తొలగిస్తుంది. దీనితో మీరు మృదువైన, మెరిసే చర్మం పొందుతారు.

పసుపు – నెయ్యి: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి, అర చెంచా పసుపు వేయాలి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆపై శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇది మీ ముఖం నుండి టానింగ్, మచ్చలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

శెనగ పిండి- నెయ్యి : ఒక గిన్నెలో 2 చెంచాల నెయ్యి, ఒక చెంచా శనగపిండి, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం వేయండి. తర్వాత బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై సరిగ్గా అప్లై చేయండి. తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా, మీ పిగ్మెంటేషన్, చిన్న చిన్న మచ్చల సమస్య తొలగిపోతుంది.

కుంకుమపువ్వు- నెయ్యి : ఒక గిన్నెలో ఒకటి నుండి ఒకటిన్నర చెంచా నెయ్యి తీసుకోండి. 3-4 కుంకుమపువ్వు రేకులు వేసి కలపాలి. తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి.. ఆ తర్వాత మీ ముఖం మొత్తానికి బాగా అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల పాటు ముఖంపై ఉంచి, ఆపై కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల ముడతలు తగ్గుతాయి.

సాదా నెయ్యి : మీ అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి. తేలికపాటి చేతులతో మీ ముఖాన్ని మసాజ్ చేయండి. రాత్రి పడుకునే ముందు కళ్ల కింద మసాజ్ చేస్తే నల్లటి వలయాల సమస్య తొలగిపోతుంది. దీనితో పాటు మెరిసే చర్మాన్ని పొందుతారు.

ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

– ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

– నెయ్యిలో యాంటీఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ముడతలు తగ్గుతాయి.

– ముఖం దురద నుండి కూడా నెయ్యి ఉపశమనాన్ని అందిస్తుంది.

– చలికాలపు పొడి చర్మాన్ని పోగొట్టడంలో నెయ్యి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

– పెదాల సమస్య నుంచి బయటపడేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.

– నల్లటి వలయాలను తొలగించేందుకు నెయ్యి దివ్యౌషధంలా పనిచేస్తుంది.

– ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టేందుకు నెయ్యి ఎంతో మేలు చేస్తుంది.

– నెయ్యి ముఖంపై ఉన్న మచ్చలను తేలికగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.