Comet Coming: ఆకాశంలో అద్భుత దృశ్యం.. 50వేల సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న అవకాశాన్ని కోల్పోకండి..!

50వేల సంవత్సరాల క్రితం అంటే మంచు యుగంలో జరిగిన అద్భుతం.. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే ఇది కనిపిస్తుంది. ఆ రోజు చంద్రుడు నిండుగా కనిపిస్తే, దానిని చూడటం కాస్త కష్టమేనంటున్నారు శాస్త్రవేత్తలు..

Comet Coming: ఆకాశంలో అద్భుత దృశ్యం.. 50వేల సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న అవకాశాన్ని కోల్పోకండి..!
Comet
Follow us

|

Updated on: Jan 09, 2023 | 3:29 PM

Comet : అంతరిక్ష రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇదో గొప్ప అవకాశం.. నిజంగా చెప్పాలంటే ఇది వారికి శుభవార్త. ఎందుకంటే, 50,000 సంవత్సరాలలో ఎన్నడూ జరగనిది త్వరలో జరగబోతోంది. 50వేల సంవత్సరాల క్రితం అంటే మంచు యుగంలో భూమికి దగ్గరగా వచ్చిన తోకచుక్క.. మరోసారి భూమికి సమీపంగా రాబోతుంది. ఆ తోకచుక్కను చూడటం మిస్సైతే మాత్రంమరో 50 వేల ఏళ్ల వరకు వేచి చూడాల్సిందే. ఈ అరుదైన తోకచుక్కను నేరుగా కంటితో చూసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇతర తోకచుక్కల కంటే ఇది భిన్నమైంది. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే ఇది కనిపిస్తుంది. ఆ రోజు చంద్రుడు నిండుగా కనిపిస్తే, దానిని చూడటం కాస్త కష్టమేనంటున్నారు.

ఈ తోకచుక్కను అమెరికాలోని కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ గుర్తించింది. గతేడాది మార్చి నెలలో బృహస్పతి గ్రహం దగ్గరికి వెళ్ల డాన్ని ఆయన తొలిసారి చూశారు. ఈ తోకచుక్కకు C/2022 E3 (ZTF) అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భూమికి దాదాపు 4.20 కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది. జనవరి 12న సూర్యుడి నుంచి తోకచుక్క దూరం 160 మిలియన్ కిలో మీటర్లు. అదే ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భూమికి దగ్గరగా అది చేరుకుంటుంది. అంటే.. 42 మిలియన్ కిలో మీటర్లు దూరం అన్నమాట. దీని కంటే చిన్నగా ఉండే నియోవైజ్ అనే తోకచుక్క 2020 మార్చిలో భూమి దగ్గరకు వచ్చినప్పుడు మామూలు కళ్లకే కనిపించింది. అందువల్ల ఇది కూడా కనిపిస్తుందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు.

అయితే, ఫిబ్రవరి 10న అంగారక గ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆకాశంలో తోకచుక్కను గుర్తించేందుకు మరో అవకాశం వస్తుందని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలో పనిచేస్తున్న కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ థామస్ ఫ్రిన్స్ పేర్కొన్నారు. ఈ తోకచుక్క ఒక కిలోమీటరు వ్యాసం కలిగి ఉందని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు