AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student shoots teacher : క్లాస్‌ రూమ్‌లో పేలిన తుపాకీ..! టీచర్‌ని కాల్చేసిన ఏడేళ్ల విద్యార్థి..

హుటాహుటినా తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Student shoots teacher : క్లాస్‌ రూమ్‌లో పేలిన తుపాకీ..! టీచర్‌ని కాల్చేసిన ఏడేళ్ల విద్యార్థి..
Gun Fire
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2023 | 1:35 PM

Share

అమెరికాలో గన్​ కల్చర్​ మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది. విచ్చలవిడి గన్‌ వాడకంతో సామాన్యులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి రోజూ ఏదో ఒకచోట కాల్పులు జరిగిన ఘటన వార్తల్లో వినబడుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థి తన టీచర్​పై కాల్పులు జరిపిన ఘటన వర్జీనియాలో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఏడేళ్లు కూడా నిండని బాలుడు టీచర్‌పై కాల్పులకు తెగబడటం అందరిలోనూ ఆందోళనరెక్కేత్తిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఏడేళ్ల బాలుడు శుక్రవారం రిచ్​నెక్​ ఎలిమెంటరీ స్కూల్​లో చదువుతున్నాడు. రోజులాగే స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి 30ఏళ్ల టీచర్​పై క్లాస్​రూమ్​లోనే కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీచర్​కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి ఆరోగ్య, మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై వర్జీనియా సూపరిండెంట్​ ఆఫ్​ స్కూల్స్​ జార్జ్​ పార్కర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.