Goji Berry: లడఖ్‌లో దొరికే ఈ పండుతో క్యాన్సర్ నుంచి మధుమేహం వరకు అదుపులో ఉంటుంది!
ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. మంటను తగ్గిస్తాయి. శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.
గోజీ బెర్రీ: లడఖ్‌లో లభించే ఆసియా పండు. ఇది పరిమాణంలో చిన్నదే కానీ, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తినడానికి తియ్యగా ఉంటుంది. పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, జింక్, థయామిన్ సెలీనియం, కాపర్, రిబోఫ్లావిన్, ఐరన్ అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తాయి. లడఖ్ కాకుండా ఇది ప్రధానంగా చైనాలో కూడా విరివిగా లభిస్తుంది. 2000 సంవత్సరాలకు పైగా చైనాలో గోజీ బెర్రీని నిరంతరం ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
మధుమేహం: గోజీ బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే డయాబెటిక్ రోగులు గోజీ బెర్రీలను తినాలని వైద్యులు సూచిస్తారు. గోజీ బెర్రీలు రక్తంలో ఇన్సులిన్ గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయని 2015లో జరిగిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గోజీ బెర్రీలు HDL స్థాయిలను పెంచుతాయి.
కాలేయ వ్యాధికి ప్రయోజనం: చైనాలో కాలేయ వ్యాధిగ్రస్తులు గోజీ బెర్రీని ఎక్కువగా తింటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గోజీ బెర్రీలు ప్రయోజనకరంగా ఉంటాయి. కాలేయ క్యాన్సర్ కణాలపై పరిశోధనలో గోజీ బెర్రీలు కణితి పెరుగుదలను నిరోధించగలవని వెల్లడించింది.
క్యాన్సర్‌ను నివారణలో: జర్నల్ ఆఫ్ డ్రగ్ డిజైన్ డెవలప్‌మెంట్, థెరపీలో నివేదిక ప్రకారం, గోజీ బెర్రీలు కణితి పెరుగుదలను నిరోధిస్తాయి. వైద్యం ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. అందుకే క్యాన్సర్ రోగులు ఆహారంలో గోజీ బెర్రీలను చేర్చుకోవాలని సలహా ఇస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. మంటను తగ్గిస్తాయి. శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.
కళ్లకు మేలు చేస్తుంది: గోజీ బెర్రీలు కంటి వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇది UV కిరణాల ఆక్సీకరణ ఒత్తిడి, చుట్టుపక్కల ఉన్న ఫ్రీ రాడికల్స్ నుండి కళ్లను రక్షిస్తుంది.
రోగనిరోధక శక్తి కోసం : గోజీ బెర్రీలలో ఉండే ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. వాటిలో విటమిన్ ఎ,సి పుష్కలంగా ఉన్నాయి. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
గోజీ బెర్రీ ప్రతికూలతలు… గోజీ బెర్రీస్‌లో బీటైన్ ఉంటుంది. ఈ మూలకం అబార్షన్‌కు ఉపయోగించబడుతుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోకూడదు. మీరు గోజీ బెర్రీలను ఎక్కువగా తీసుకుంటే, అది డయేరియా ప్రమాదాన్ని పెంచుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో దానిని తీసుకునే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..