Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Position : మీరు నిద్రించే భంగిమ సరైనదేనా..? లేదంటే భవిష్యత్తులో ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..

దీంతో తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది.. ఫలితంగా అజీర్ణ సమస్యలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మరో విషయం ఏమిటంటే..

Sleep Position : మీరు నిద్రించే భంగిమ సరైనదేనా..? లేదంటే భవిష్యత్తులో ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..
Sleep
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 07, 2023 | 9:48 AM

రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి అని మనందరికీ తెలిసిందే. కానీ, మీరు ఎలా నిద్రపోతారు అనేది కూడా అంతే ముఖ్యం. స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉండాలి..? అనేది కూడా తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఏ భంగిమలో మనం సుఖంగా నిద్రపోగలమో అదే యాంగిల్‌లో పడుకుంటాం. సాధారణంగా నిద్రించే సమయంలో చాలామంది ఎడమవైపు, కుడివైపు తిరిగి నిద్రిస్తుంటారు. మరికొంతమంది వెల్లకిలానూ, బోర్లా తిరిగి నిద్రిస్తుంటారు. చాలామందికి బోర్లగా పడుకుని నిద్రపోవడమే ఇష్టం. అయితే ఈ భంగిమలో నిద్రపోవడం ఎంత హానికరమో తెలుసా? అమెరికాకు చెందిన వైద్యులు బోర్లా పడుకుని నిద్రపోవడం వల్ల కలిగే సమస్యల గురించి చెప్పారు. కడుపుపై భారం వేస్తూ నిద్రించటం వల్ల వెన్నెముకపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది. మీ వెన్నెముకను స్థిరంగా ఉంచడానికి మసాజ్ టేబుల్ ఉత్తమైన ఎంపిక. మీరు మీ మంచం మీద మీ పొట్టపై ఒత్తిడి చేస్తూ.. బోర్లా పడుకుంటే, మీరు రాత్రంతా మీ మెడను అటూ ఇటూ తిప్పుతూనే ఉంటారు. దీని కారణంగా, మీ వెన్నెముక అనేక సార్లు తిప్పవలసి ఉంటుంది. వెన్నెముకను మితిమీరి మెలితిప్పటం కారణంగా, మీరు భవిష్యత్తులో మెడ నొప్పిని భరించాల్సి వస్తుంది.

ఇదే విషయాన్ని కోల్‌కతాలోని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు కూడా చెబుతున్నారు. మనం పొట్టపై ఒత్తిడి చేస్తూ పడుకున్నప్పుడు మన బరువు చాలా భాగం శరీరం మధ్య భాగంపై పడుతుందని చెప్పారు. అలా మీరు నిద్రపోతున్నప్పుడు, వెన్నెముకను స్థిరంగా ఉంచడం కొన్నిసార్లు కష్టం. వెన్నెముకపై ఒత్తిడి పెట్టడం వల్ల మీ శరీరంలోని వివిధ వ్యవస్థలపై ఒత్తిడి పడుతుంది. పొట్టపై భారం వేస్తూ నిద్రపోవడం వల్ల మెడ స్థానంలో భంగం కలిగిస్తుంది. దీని ప్రభావం మొదట్లో కనిపించదు. రాను రాను పరిస్థితి దిగజారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, కుడివైపునకు తిరిగి పడుకోవద్దని సూచిస్తున్నారు. ఎడమవైపు తిరిగి నిద్రిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

ఎందుకంటే.. కడుపులో ఎడమవైపు జీర్ణాశయం ఉంటుంది. అక్కడే క్లోమగ్రంథి కూడా ఉంటుంది. ఎడమవైపు తిరిగి నిద్రించిన సమయంలో భూగురత్వాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా ఉంటాయి. అప్పుడు మీ జీర్ణ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు.. రోగనిరోధకత కూడా బలపడుతుంది. శోషరస వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఎడమవైపు తిరిగి పడుకోవాలట. దీంతో తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది.. ఫలితంగా అజీర్ణ సమస్యలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మరో విషయం ఏమిటంటే.. గుండె కూడా ఎడమవైపునే ఉంటుంది. అందుకే అటువైపు తిరిగి పడుకోవాలి.. అలా చేస్తే రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. గుండెకు కొంతమేర విశ్రాంతి దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.