Raisins For Diabetes: డయాబెటిక్ బాధితులు ఎండు ద్రాక్ష తినొచ్చా? తినకూడదా? డాక్టర్ల సలహా ఏమిటంటే?
హెల్త్‌లైన్ వెబ్ సైట్ ప్రకారం, మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ఎండుద్రాక్షను చేర్చుకోవచ్చు, కానీ మితంగా తీసుకోవాలి. అన్ని పండ్ల మాదిరిగానే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి.
ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే దాన్ని శాశ్వతంగా వదిలించుకోవడం కష్టం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే శరీరంలో షుగర్ స్థాయులు పెంచకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తినడానికి రుచిగా ఉన్నప్పటికీ కొన్ని ఫుడ్స్‌ను కచ్చితంగా దూరం పెట్టాలి. అలాగే పోషక విలువలున్న ఆహారాన్ని డైట్‌లో తీసుకోవాలి. కాగా డయాబెటిక్ రోగులు ఎండు ద్రాక్ష తినడంపై చాలామందికి ఎన్నో అపోహలున్నాయి. పాయసం, హల్వా, కేసరిబాత్ మొదలైన స్వీట్లలో ఉపయోగించే వీటిలో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, మధుమేహం ఉన్నవారు ఎండుద్రాక్ష తినకూడదా? తింటే డయాబెటిక్ రోగులపై చెడు ప్రభావం చూపుతుందా? తదితర అపోహలపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. హెల్త్‌లైన్ వెబ్ సైట్ ప్రకారం, మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ఎండుద్రాక్షను చేర్చుకోవచ్చు, కానీ మితంగా తీసుకోవాలి. అన్ని పండ్ల మాదిరిగానే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీనిని సమతుల్య ఆహారంలో చేర్చుకోవచ్చు.
జీర్ణక్రియకు మంచిది
సహజ చక్కెరలు కాకుండా ఎండుద్రాక్ష ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం. అయితే మంచి గ్లైసెమిక్ నియంత్రణను నిర్వహించడానికి మితంగా తినాలి. అలాగే వ్యాయామం చేయాలి. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన ఇనుము ఎండు ద్రాక్షలో అధికంగా ఉంటుంది. ఇదే గాక క్యాల్షియం, పొటాషియం మరియు బోరాన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడం అలాగే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అధిక ఫైబర్ ఆహారం తీసుకునే వ్యక్తులు బరువు తగ్గుతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆహారంలో ఎక్కువ ఫైబర్ జోడించడానికి ఎండుద్రాక్ష అనుకూలమైనది. అలాగే రుచికరమైన ఎంపిక.
గుండె ఆరోగ్యానికి
ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఎముకలకు మేలు
ఎండుద్రాక్షలో బోరాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలలో ఒకటి. బోరాన్ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో బోరాన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..