Eye Wrinkle: కళ్ల కింద ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సూపర్ టిప్స్ మీకే!
ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి. పది పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ముడతలు తగ్గిపోయి ముఖం మెరుస్తూ ఉంటుంది.

సాధారణంగా కొందరికి కళ్ల కింద ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, గంటల తరబడి ఫోన్లు మాట్లాడేవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం..ఈ ముడతలు అందాన్ని తగ్గించడంతో పాటు వయసు పైబడిన వారిలా చూపిస్తాయి. అందుకే ఈ ముడతలను నివారించుకునేందుకు ఖరీదైన క్రీములు, లోషన్లు ప్రయత్నిస్తూ పర్స్ ఖాళీ చేసుకుంటుంటారు.. కానీ, ఇంట్లో న్యాచురల్‌గానే కళ్ల కింద ఏర్పడిన ముడతలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..? ఇలాంటి ఇంట్లో పాటించే సింపుల్ టిప్స్‌తో మీ కంటి కింది ముడతలను వదిలించుకోవచ్చు..అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…
కంటి కింద ముడతల నివారణ కోసం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. దీని వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీరు మనకు చాలా ముఖ్యమైన అంశం. ఇది అనేక వ్యాధుల నుండి మనలను రక్షించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు పైనాపిల్ ఫ్రూట్ కళ్ల కింద వచ్చిన ముడతలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పైనాపిల్ నుంచి రసం తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి. పది పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ముడతలు తగ్గిపోయి ముఖం మెరుస్తూ ఉంటుంది.
దోసకాయ కూడా కళ్ల కింద ఏర్పడిన ముడతలను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. దోసకాయ తొక్క, లోపల ఉండే గింజలు తీసేసి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి కలిపి కళ్ల కింద అప్లై చేసుకోవాలి. ఓ పావుగం, 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేసినా మంచి ఫలితం ఉంటుంది.




కళ్ల కింద ముడతలను తొలగించడంలో బాదం నూనె కూడా మేలు చేస్తుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో బాదం నూనె, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి. మెల్ల మెల్లగా వేళ్లతో రెండు, మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఇలా చేసి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుడా చేస్తే కొద్ది రోజుల్లోనే కళ్ల కింద ఏర్పడ్డ ముడతలు తగ్గుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…