Sea Snake: బీచ్‌లలో సంచరిస్తున్న సముద్ర పాములు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

అవి చూసేందుకు చనిపోయినట్టుగా కనిపిస్తాయని, పాము చనిపోయిందని మీరు భావించినప్పటికీ, సముద్రపు పాములను తాకడానికి ప్రయత్నించకూడదని వారు హెచ్చరించారు. వాటికి

Sea Snake: బీచ్‌లలో సంచరిస్తున్న సముద్ర పాములు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..
Sea Snake In Uae
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2023 | 2:44 PM

అబుదాబి బీచ్‌లలో సముద్రపు పాములు సంచరిస్తున్నాయని పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రపు పాములు శీతాకాలంలో వేటాడటం, సంభోగం కోసం లోతులేని నీటితో నిండిన ప్రాంతాలను ఎంచుకుంటాయి. సముద్రపు పాములు బహిరంగ నీటి ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్‌లలో ఎక్కువగా కనిపిస్తాయని హెచ్చరికలో పేర్కొంది. సాధారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు సముద్రపు పాములు కనిపిస్తాయి. అబుదాబిలో, కార్నిచ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఈ వారం సగటు ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి.

బీచ్‌లకు వెళ్లే వారు సముద్ర పాములు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. అవి చూసేందుకు చనిపోయినట్టుగా కనిపిస్తాయని, పాము చనిపోయిందని మీరు భావించినప్పటికీ, సముద్రపు పాములను తాకడానికి ప్రయత్నించకూడదని వారు హెచ్చరించారు. వాటికి వీలైనంత దూరం పాటించాలని ఆదేశించారు.

సముద్రపు పాములు విషపూరితమైనప్పటికీ, అవి సాధారణంగా కాటు వేయవు. అయితే, పాములు భయపడినా, రెచ్చగొట్టినా కాటేస్తాయి. పాము కాటుకు గురైతే వెంటనే వైద్యులను ఆశ్రయించి ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలన్నారు. సముద్రపు పాములను చూసిన ప్రజలు అబుదాబి ప్రభుత్వ కాల్ సెంటర్‌కు 800555కు కాల్ చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.