Garuda Puranam: గరుడ పురాణంలోని మరణ రహస్యం..! మనిషి చనిపోయిన 13 రోజుల వరకు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా..?
అందుకే మరణానంతరం 13 రోజుల పాటు అనేక క్రతువులు నిర్వహిస్తారు. చనిపోయినవారి ఆత్మశాంతి కోసం ప్రతిరోజూ కొంత ఆహారం పక్కన పెడుతుంటారు. పదమూడవ రోజున దీనిని పిండన చేస్తారు.

గరుడ పురాణం జననం నుండి మరణం వరకు.. అంతకు మించి ఆత్మ ప్రయాణం గురించి చాలా విషయాలు చెబుతుంది. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, గరుడ పురాణం మరణానికి సంబంధించిన ఆచారాల గురించి కూడా చాలా నియమాలను సూచిస్తుంది. దానిని అనుసరించి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తారు కుటుంబీకులు. దీంతో పూర్వీకుల ఆశీర్వాదంతో ఆ కుటుంబం పురోగతి, ఆనందం, శ్రేయస్సును పొందుతుంది. ఈ క్రమంలోనే గరుడ పురాణం ప్రకారం, మానవ శరీరంలోని ఆత్మ.. మరణించిన తర్వాత 13 రోజుల పాటు తన సొంత ఇంట్లోనే ఉంటుందని చెబుతుంది.. అందుకే మరణానంతరం 13 రోజుల పాటు అనేక క్రతువులు నిర్వహిస్తారు. చనిపోయినవారి ఆత్మశాంతి కోసం ప్రతిరోజూ కొంత ఆహారం పక్కన పెడుతుంటారు. పదమూడవ రోజున దీనిని పిండన చేస్తారు.
పురాణాల ప్రకారం, యమదూతలు మరణించిన వెంటనే ఆత్మను తమతో పాటు యమలోకానికి తీసుకువెళతారు. అక్కడ అతని పనులు లెక్కించబడతాయి. 24 గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుంది. దీనికి కారణం కుటుంబ అనుబంధం. ఇక్కడ ఆత్మ తన బంధువుల మధ్య తిరుగుతుంది. ఇంటిల్లిపాదితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ, కుటుంబసభ్యులకు తన మాట వినిపించకపోవడంతో ఆత్మ కలత చెందుతుంది. ఈ సమయంలో ఆత్మ చాలా బలహీనంగా మారుతుంది. ఇది ఎక్కడికీ ప్రయాణించదు. తర్వాత కుటుంబ సభ్యులు పిండాదన చేస్తారు. పదమూడవ రోజున అవసరమైన పూజలు చేస్తారు. ఇది ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఆ తర్వాత యమలోకానికి ప్రయాణిస్తుంది. అంతే కాదు, పిండ సమయంలో ఇచ్చే ఆహారం ఒక సంవత్సరం పాటు ఆత్మకు బలాన్ని ఇస్తుంది. అందుకే పిండదానాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు పెద్దలు.
మరోవైపు, పిండాన్ని సమర్పించని ఆత్మలను 13వ రోజున యమదూతలు యమలోకానికి లాక్కెలతారు. ఇది మరణించిన వ్యక్తి ఆత్మను చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వ్యక్తుల ఆత్మ చాలా బాధపడుతుంది.




Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.