Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో స్నేహం ప్రమాదం.. ఎవరి బాధను అర్థం చేసుకోరు దూరం పాటించామంటున్న చాణక్య

అదే సమయంలో.. నీతి శాస్త్రంలో... కొందరు వ్యక్తులు ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకోరు.. తమ స్వార్ధం గురించి మాత్రమే ఆలోచిస్తారు.. అలాంటి వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణుక్యుడు ప్రస్తావించారు. ఈరోజు అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. 

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో స్నేహం ప్రమాదం.. ఎవరి బాధను అర్థం చేసుకోరు దూరం పాటించామంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2023 | 4:42 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త , రాజకీయవేత్త. అంతేకాదు.. అతను గొప్ప అధ్యాపకుడు కూడా. తన విధానాల బలంతో, చాణుక్యుడు ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. ఆయన చెప్పిన విధానాలనే నేటి యువతరం జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అనుసరిస్తోంది. నీతి శాస్త్రంలో..  ఆచార్య చాణక్యుడు దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. అదే సమయంలో.. నీతి శాస్త్రంలో… కొందరు వ్యక్తులు ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకోరు.. తమ స్వార్ధం గురించి మాత్రమే ఆలోచిస్తారు.. అలాంటి వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణుక్యుడు ప్రస్తావించారు. ఈరోజు అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.

దొంగ – ఆచార్య చాణక్యుడు ప్రకారం..  ఒక దొంగ ఇతరుల వ్యక్తి బాధను అర్థం చేసుకోడు. అతను దొంగతనం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఒకరి ఇంటిలోని సొమ్ముని దొంగిలించడం వల్ల ఆ వ్యక్తికి.. ఇతరులకు హాని జరుగుతుందని అతను అనుకోడు. కేవలం దొంగతనాలపైనే దృష్టి పెడతాడు.

స్వార్థపరులు – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. స్వార్థపరులు తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారు తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారికి తమ స్వార్థం ముందు ఎవరి బాధ, కష్టాలు వీరికి కనిపించవు.  అర్థం కావు. అలాంటి వారికి ఎప్పుడూ దూరం పాటించండి.

ఇవి కూడా చదవండి

మాదకద్రవ్యాలకు బానిసలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మాదకద్రవ్యాలకు బానిసలైన వారి నుండి దూరంగా ఉండాలి.  అలాంటివారు మత్తు కోసం ఎంతకైనా తెగిస్తారు. అతి పెద్ద నేరం చేయవచ్చు. మత్తులో వీరి మంచి చెడు తేడా తెలియదు.. విచక్షణ ఉండదు. మత్తుకు బానిసైన వ్యక్తులతో స్నేహం చేస్తే.. మిమ్మల్ని కూడా మత్తుకి బానిసగా మార్చవచ్చు.

వేశ్య – వేశ్య కూడా తన డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆమె ఎవరి బాధలను.. కష్ట, నష్టాలను పట్టించుకోదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)