Vastu Tips: ఇంట్లో హనుమంతుడి ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరం.. వాస్తు నియమం ఏమి చెబుతుందంటే

వాస్తు నియమాల ప్రకారం, పడకగదిలో హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. హనుమంతుడి విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది.

Vastu Tips:  ఇంట్లో హనుమంతుడి ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరం.. వాస్తు నియమం ఏమి చెబుతుందంటే
Lord Hanuman Vastu Tips
Follow us

|

Updated on: Jan 09, 2023 | 3:47 PM

వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువులు ఉంచాలి.. ఏది ఉండకూడదు అనే విషయంలో వాస్తు నియమాలున్నాయి. హిందూ సనాతన ధర్మంలో ప్రార్థనా స్థలానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తులో దేవతామూర్తుల విగ్రహాలను ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. హిందూ మతంలో.. హనుమంతుడు కలియుగ దేవతగా పరిగణించబడతాడు. ఈజీగా భక్తులకు వరం ఇచ్చే దైవం. ఈ రోజు ఇంట్లో హనుమంతుని విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచుకుంటే శుభమో తెలుసుకుందాం.

పడకగదిలో హనుమంతుడి ఫోటోని లేదా విగ్రహాన్ని ఉంచవద్దు వాస్తు నియమాల ప్రకారం.. పడకగదిలో హనుమంతుడు ఫోటో లేదా విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. హనుమంతుడు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. హనుమంతుడు విగ్రహాన్ని పడకగదిలో ఉంచడం వల్ల వాస్తుదోషం కలుగుతుంది. వాస్తు ప్రకారం, హనుమంతుని విగ్రహం లేదా ఫోటోను దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో హనుమంతుడు కూర్చున్న స్థితిలోఉండాలని గుర్తుంచుకోండి.

ఏ దిశలో విగ్రహాన్నిఉంచాలంటే  అంతేకాదు హనుమంతుడు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. హనుమంతుని ఫోటోను ఈ దిశలో ఉంచడం ద్వారా మనిషికి కష్టాలు త్వరగా తొలగిపోతాయని ఒక నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం పంచ ముఖ హనుమంతుని ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు , సంపదలు చేకూరుతాయి. పంచ ముఖ హనుమంతుడుని ఇంట్లో పెట్టుకోవడానికి దక్షిణ దిశను ఎంచుకోవాలి. పర్వతాన్ని ఎత్తుతున్న హనుమంతుని బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం అని ఒక నమ్మకం. హనుమంతుడు ఫోటోతో.. ఆ వ్యక్తి  ఎటువంటి పరిస్థితులోను ఎదురైనా సరే సులభంగా దాటవచ్చు.

ఇవి కూడా చదవండి

శుభ్రత పట్ల శ్రద్ధ   వాస్తు ప్రకారం.. ఎక్కడైనా హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఉంటే.. ఆ ప్లేస్ ఎల్లప్పుడూ శుభ్రత ఉండాలి. పూజలు క్రమం తప్పకుండా చేయాలి. హనుమంతుని విగ్రహం ఉన్న ఇళ్లలో ప్రతి మంగళవారం రోజున ఆయనను పూజించడం, సుందరకాండ పారాయణం చేయడం శుభప్రదం. ఇంటి దక్షిణ గోడపై ఎరుపు రంగులో కూర్చున్న భంగిమలో హనుమంతుని చిత్రాన్ని ఉంచడం ద్వారా, దక్షిణం వైపు నుండి వచ్చే ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, హనుమంతుని ఫోటో లేదా విగ్రహాన్ని  మెట్ల క్రింద, వంటగది లేదా మరేదైనా అపవిత్ర ప్రదేశంలో ఉంచవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)