Joshimath Epic Story: గేట్‌వే ఆఫ్ హిమాలయకు హిందూ పురాణాలతో సంబంధం గురించి తెలుసా?

ధౌలిగంగ , అలకనంద సంగమం వద్ద ఉన్న జోషిమఠం చార్ ధామ్‌లలో ఒకటైన బద్రీనాథ్‌కి ప్రవేశ ద్వారం. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఒక పురాణ కథనం వెలుగులోకి వచ్చింది. బద్రీనాథ్ ధామ్ ఏదో ఒక రోజు కనుమరుగవుతుందని చెప్పబడిన ప్రవచనంతో పాటు.. అనేక ఇతిహాసాలను గుర్తు చేసుకుంటున్నారు.

Joshimath Epic Story: గేట్‌వే ఆఫ్ హిమాలయకు హిందూ పురాణాలతో సంబంధం గురించి తెలుసా?
Joshimath Epic Story
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2023 | 6:10 PM

అంబరాన్ని అందుకున్నాం.. సముద్ర లోతులను కొలిచేస్తున్నాం అంటూ గర్వపడే మనిషికి ప్రకృతి ఎప్పుడూ ఏదొక రూపంలో సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా ప్రకృతి మనిషి మేధస్సుకు ఇచ్చిన పరీక్ష ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో పర్వతాల మీద ఏర్పడుతున్న  పగుళ్లు. హిమానీనదం మీద ఉన్న ఈ నగరానికి కష్టాలు పెరుగుతున్నాయి. జోషిమఠం పురాతన పేరు ‘జ్యోతిర్మత్’. ఈ ఆధ్యాత్మిక నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధౌలిగంగ , అలకనంద సంగమం వద్ద ఉన్న జోషిమఠం చార్ ధామ్‌లలో ఒకటైన బద్రీనాథ్‌కి ప్రవేశ ద్వారం. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఒక పురాణ కథనం వెలుగులోకి వచ్చింది. బద్రీనాథ్ ధామ్ ఏదో ఒక రోజు కనుమరుగవుతుందని చెప్పబడిన ప్రవచనంతో పాటు.. అనేక ఇతిహాసాలను గుర్తు చేసుకుంటున్నారు. జోషిమఠానికి చెందిన  5 ఇతిహాసాల గురించి తెలుసుకుందాం.

1) నరసింహ అవతారం భక్తుడైన ప్రహ్లాదుడి పిలుపు మేరకు విష్ణువు నరసింహునిగా అవతరించి హిరణ్యకశ్యపుని వధించాడని పురాణాలు చెబుతున్నాయి.  హిరణ్య కశ్యపుని వధ అనంతరం నరసింహుని ఉగ్ర రూపం శాంతించలేదు. దీంతో లక్ష్మీదేవి.. ప్రహ్లాదుని వద్దకు వెళ్లి .. నరసింహుడిని  శాంతింపజేయమని కోరింది. ప్రహ్లాదుని మంత్రోచ్ఛారణ తరువాత ఉగ్ర రూపాన్ని వదిలి శాంతించాడు. ఆ ప్రశాంత రూపంలో  జోషిమఠంలో నరసింహ స్వామిని ప్రతిష్టించాడు. బద్రీనాథ్ ధామ్ వదిలిన బద్రినాథుడు..  శీతాకాలంలో ఇక్కడే ఉంటాడు.

2) నర-నారాయణ పర్వతం:  జోషిమఠంలోని ఈ నరసింహ ఆలయంలో ఉన్న స్వామివారి కుడి చేయి సన్నబడుతుందని చెబుతారు. స్కంద పురాణంలోని కేదార్‌ఖండ్‌లోని సనత్ సంహిత ప్రకారం.. ఇలా సన్నబడిన చేయి.. తెగిపోయిన కింద పడుతుంది.. అప్పుడు ఇక్కడ ఉన్న నర-నారాయణ పర్వతాలు కలుస్తాయని.. అప్పుడు బద్రీనాథ్ మార్గం మూసివేయబడుతుందని తెలుస్తోంది. తపోవనంలోని జోషిమఠానికి  19 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రిలో బద్రీ విశాల్ భగవంతుడిని పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

3) ఆది గురువు శంకరాచార్య జ్ఞానాన్ని పొందిన ప్లేస్: మరొక విశిష్టత ఏమిటంటే.. ఆది గురువు శంకరాచార్యకి సంబంధించినది. 8వ శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్య తపస్సు చేశారని  పురాణగాథ. క్రీ.శ.815లో ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసి ‘జ్ఞానాన్ని’ పొందిన మల్బరీ చెట్టు..  36 మీటర్ల వృత్తాకార మల్బరీ  చెట్టు నేటికీ ఆది గురువు శంకరాచార్య తపస్సుకి సజీవ సాక్ష్యంగా నిలిచింది. 2400 ఏళ్లనాటి ఈ చెట్టు పక్కనే శంకరాచార్యుల తపస్సు గుహ కూడా ఉంది. దీనిని జ్యోతిరేశ్వర మహాదేవ అంటారు. దేశంలో శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలలో మొదటిది ఇదే.  శంకరాచార్యకు జ్ఞానపు దివ్యకాంతి లభించినందున ఈ ప్రదేశాన్ని జ్యోతిర్మఠం అని పిలిచేవారు.. కాలక్రమంలో జోషిమఠంగా ప్రసిద్ధిగాంచింది.

4) స్వర్గ ద్వారం జోషిమఠాన్నీ ‘గేట్ ఆఫ్ హెవెన్’ అని పిలవడం వెనుక కూడా ఒక పురాణం ఉంది. పాండవులు తమ రాజ్యాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. వారు జోషిమఠం నుండి ఈ పర్వత మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతారు. బద్రీనాథ్ కంటే ముందు ఉన్న పాండుకేశ్వర్ పాండవుల జన్మస్థలంగా చెబుతారు. బద్రీనాథ్ తర్వాత.. మాన్ గ్రామం దాటిన అనంతరం ఒక శిఖరం వస్తుంది.. ఇది స్వర్గారోహిణిగా హిందువుల విశ్వాసం. ఇక్కడి నుండి అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవులు, ద్రౌపతిలు  ఒక్కొక్కరుగా యుధిష్ఠిరుడిని విడిచిపెట్టారు. చివరికి ఒక కుక్క మాత్రమే యుధిష్ఠిరునితో కలిసి స్వర్గానికి వెళ్ళింది. జోషిమఠం కంటే ముందుగా.. స్వర్గాన్ని తలపించే అందమైన పూల లోయ మొదలవుతుంది. అందుకే జోషిమఠాన్నీ స్వర్గ ద్వారం అని కూడా పిలుస్తారు.

5) కత్యురి రాజవంశం రాజధాని జోషిమఠం 7వ శతాబ్దం  11వ శతాబ్దాల మధ్య కుమావోన్ , గర్వాల్ ప్రాంతాలను పాలించిన కత్యూరి రాజవంశానికి సంబంధించినది. వీరి  రాజధాని కత్యూరి పాలనలో జోషిమఠం పేరు కీర్తిపూర్ అని చెబుతారు. కత్యూరి పాలకుడు లలిత్సుర్ రాగి ఫలకంలో.. ఈ ప్రాంతం  కీర్తిపూర్ అని.. మరొకొన్ని చోట్ల కార్తికేయపూర్ అని పేర్కొనబడింది. కత్యురి రాజవంశ స్థాపకుడు కాంతుర వాసుదేన ఇక్కడ తన పాలనను స్థాపించాడని నమ్ముతారు. ఈ వంశానికి చెందిన రాజులు ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించారు. కీర్తిపూర్‌నే కాలక్రమంలో జోషిమఠంగా పేరు మార్చుకుందని విశ్వాసం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ