Success Mantra: నేటి తరం మరచిపోతున్న పదం సహనం.. లక్ష్య సాధనలో.. విజయంలో ఓపిక విలువ ఏమిటో తెలుసా..
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. జీవితంలో సహనాన్ని విడిచిపెట్టి లేదా త్వరగా త్వరగా పనులు అయిపోవాలని.. తమ లక్ష్యాన్ని సాధించడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
కొన్ని పనులు మెల్లమెల్లగా నిదానంగా జరుగుతాయి. విత్తు నాటిన తర్వాత తోటమాలి దానికి వంద కుండలకు నీరందిస్తాడు.. అయితే సీజన్లో మాత్రమే పండ్లు, అయినా పువ్వులైనా ఆ చెట్లు ఇస్తాయి. అదే విధంగా మనిషి జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధించాలనుకుంటే.. కృషి, పట్టుదల తో పాటు, సహనం కూడా అవసరం. అయితే నేటి మానవుడు కాలంతో పోటీపడుతూ.. వేగవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతి వ్యక్తి వీలైనంత త్వరగా ప్రతిదీ పొందాలని కోరుకుంటాడు. భూమిలో నాటిన విత్తనం మొదట మొలకగా మారడానికి తరువాత మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. దీని తరువాత.. పండ్లు కూడా నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే వస్తాయి. అటువంటి పరిస్థితిలో.. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. జీవితంలో సహనాన్ని విడిచిపెట్టి లేదా త్వరగా త్వరగా పనులు అయిపోవాలని.. తమ లక్ష్యాన్ని సాధించడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే ఓపిక సహనం ఎందుకు అవసరమో ఈరోజు తెలుసుకుందాం..
- ప్రతి వ్యక్తి జీవితంలో మరణం సహజం.. మీ పనికి తగిన ప్రశంసలు, రావొచ్చు.. లేదా విమర్శలు వినిపించవచ్చు.. అదే విధంగా సంపదకు అధిపతి లక్ష్మీదేవి వ్యక్తిని డబ్బుతో ముంచెత్తవచ్చు..లేదా నష్టపరచవచ్చు. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. సహనం కలిగి ఉన్న వ్యక్తి తన దృష్టిని లక్ష్యం నుంచి మరల్చడు.
- జీవితంతో ముడిపడి ఉన్న ఆనందం మీ అహంకారాన్ని పరీక్షిస్తుంది. దుఃఖం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఈ రెండు పరీక్షల్లో విజయం సాధించినప్పుడే అతని జీవితం విజయవంతమైనదిగా పరిగణించబడుతుంది.
- జీవితంలో తాను చేసే ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడు తన సహనాన్ని కోల్పోడు.. తనకు సమయం వచ్చే వరకూ ఓపికగా ఎదురు చూస్తాడు.
- కోపం వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే కోపం తెచ్చే చెడుని.. సహనంతో ఎదుర్కొంటే.. వేలాది క్షణాల బాధను నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
- అయితే కొందరు ఎప్పుడూ చూసినా ఉత్సాహం లేనట్లు ఉంటారు.. అయితే చాలామంది దీనిని సహనం అని అనుకుంటారు. అయితే ఏ వ్యక్తిలోనైనా సహనం అవసరం కంటే ఎక్కువగా ఉంటే, దానిని పిరికితనం అంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)