Joshimath: నేడు జోషిమఠం దుస్థితికి అభివృద్ధి పేరుతో చేస్తోన్న పనులే కారణమా..? ప్రమాదంలో మరో 30 గ్రామాలు

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇప్పుడు జోషిమఠం దుస్థికి  మానవ తప్పిదమని.. అభివృద్ధి పేరుతొ చేపట్టిన అనేక ప్రాజక్టులు అని తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగాలే ఇందుకు ప్రధాన కారణం. దీని ప్రభావం జోషిమఠంలోనే కాదు.. 4 జిల్లాల్లోని 30 గ్రామాల్లోనూ కనిపిస్తోంది.

Joshimath: నేడు జోషిమఠం దుస్థితికి అభివృద్ధి పేరుతో  చేస్తోన్న పనులే కారణమా..? ప్రమాదంలో మరో  30 గ్రామాలు
Joshimath
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2023 | 12:41 PM

దేవ భూమి ఉత్తరాఖండ్ లోని జోషిమఠంలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. భారీగా ప్రజలు ఇళ్ల ను ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ప్రతి గంటకూ ప్రమాదం పెరుగుతోంది. దీంతో మొత్తం ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. గడచిన 48 గంటల్లో భూమి మరింతగా కుంగిపోవడంతో కుప్పకూలిన ఇళ్ల సంఖ్య 561 నుంచి 603కి పెరిగింది. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన జియోలాజికల్ సర్వే ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇప్పుడు జోషిమఠం దుస్థికి  మానవ తప్పిదమని.. అభివృద్ధి పేరుతొ చేపట్టిన అనేక ప్రాజక్టులు అని తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగాలే ఇందుకు ప్రధాన కారణం. దీని ప్రభావం జోషిమఠంలోనే కాదు.. 4 జిల్లాల్లోని 30 గ్రామాల్లోనూ కనిపిస్తోంది.

4 జిల్లాల్లోని 30 గ్రామాల్లో బీటలు పడిన భూమి: రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ వరకు నిర్మిస్తున్న అతిపెద్ద రైలు ప్రాజెక్టును చేపట్టారు. దీని ప్రభావం 30కి పైగా గ్రామాలపై కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో నాలుగు జిల్లాలు చేర్చబడ్డాయి. తెహ్రీ, పౌరీ, రుద్రప్రయాగ్, చమోలి. కేవలం రుద్రప్రయాగ్‌లో.. చేపట్టిన రైల్వే ప్రాజెక్టు కారణంగా పగుళ్లు ఏర్పడినందున మరోడా గ్రామ ప్రజలు తరలివెళ్లారు. చాలా గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది.

ఆందోళనను పెంచుతోన్న రైల్వే ప్రాజెక్ట్ రిషికేశ్ నుండి కర్ణప్రయాగ రైల్వే ప్రాజెక్ట్ 125 కి.మీ మేర విస్తరించి ఉంది. దేవ్‌ప్రయాగ నుంచి జేకర్‌ జనాసు వరకు 14.8 కిలోమీటర్ల మేర టన్నెల్ కోసం బోరింగ్‌ మిషన్లు వినియోగిస్తున్నారు. మిగతా 15 సొరంగాలకు డ్రిల్ అండ్ బ్లాస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రమాదం మరింత పెరుగుతోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ కోసం నాలుగు జిల్లాల్లోని శ్రీనగర్, మలేత, గౌచర్ గ్రామాల కింద టన్నెల్‌ను తవ్వుతున్నారు. టన్నెల్‌ నిర్మాణం కోసం బ్లాస్టింగ్‌ చేసినప్పుడు బలమైన పేలుడు కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి.  ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని వాలుల్లో ఇళ్లు నిర్మించడం వల్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్ ఇప్పటికే భూకంపం జోన్-5లోకి వచ్చింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి.  అలకనంద లోయ కింద వచ్చే భాగం సెన్సిటివ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నదికి ఆనుకుని ఉన్న పర్వతాలపై అనేక రైలు ప్రాజెక్టులు నడుస్తున్నాయి. శ్రీనగర్, రుద్రప్రయాగ్‌ల్లో ఇప్పటికే చాలా భూకంప మండలాలు ఉన్నాయి. సొరంగాల కోసం పేలుళ్లు ఈ మండలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

ప్రమాదాలకు నెలవుగా మారుతున్నసొరంగాలు గత 12 ఏళ్లలో ఉత్తరాఖండ్ భౌగోళికంగా మారిపోయింది. దీనికి కారణం ప్రాజెక్టులే.  12 వేల కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులు, 24 వేల కోట్లతో చేపట్టిన రిషికేశ్ నుండి కర్ణప్రయాగ రైలు ప్రాజెక్ట్ సహా ఇతర పథకాలు. వీటి కోసం కొత్త సొరంగాలు తవ్వుతున్నారు. రైలు ప్రాజెక్టు వల్ల ఆ నాలుగు జిల్లాల్లోనూ జోషిమఠంలో ఏర్పడిన పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు.

మళ్లీ సర్వే చేస్తున్న జియోలాజికల్ సర్వే పౌరీలోని శ్రీనగర్‌లో పగుళ్లు వచ్చినప్పుడు.. దానిని పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా,  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సానుకూల నివేదికలను విడుదల చేశాయి. రైల్వే ప్రాజెక్టు వల్ల ఈ పగుళ్లు రాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపోర్టుతో కొండ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

రైలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల నివేదికను GSI, సర్వే ఆఫ్ ఇండియా సమర్పించాయని రైలు వికాస్ నిగమ్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అజిత్ సింగ్ యాదవ్ చెప్పారు. ఐఐటీ రూర్కీ కూడా ఈ నివేదికను పరిశీలించింది. ఈ ప్రాజెక్ట్  వలన ఇళ్లలో పగుళ్లు ఏర్పడినట్లు మాకు ఫిర్యాదులు అందాయి. మేము నియంత్రిత బ్లాస్టింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తున్నాము. సర్వే బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మొత్తం రూట్‌లో సర్వే నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు