AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Special: సంక్రాంతి రోజున కొన్ని ప్రాంతాల్లో ఖిచిడీ తినే సాంప్రదాయం.. ఈరోజు రుచికరమైన కిచిడీ తయారీగురించి తెలుసుకుందాం

మకర సంక్రాంతి రోజున అనేక ప్రాంతాల్లో ఖిచిడీని తినే ఆహారపదార్ధాల్లో చేర్చుకోవడం ఒక సాంప్రదాయం. ఈ ఖిచిడీ రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మకర సంక్రాంతి పండగ రానున్న నేపథ్యంలో ఈరోజు ఖిచ్డీని సులభంగా తయారు చేసే విధానం తెలుసుకుందాం.

Sankranti Special: సంక్రాంతి రోజున కొన్ని ప్రాంతాల్లో ఖిచిడీ తినే సాంప్రదాయం.. ఈరోజు రుచికరమైన కిచిడీ తయారీగురించి తెలుసుకుందాం
Moong Dal Khichdi Recipe
Surya Kala
|

Updated on: Jan 09, 2023 | 4:16 PM

Share

హిందూ సనాతన ధర్మంలో సంక్రాంతి అతి పెద్ద పండగ. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటే.. ముక్కనుమని కూడా కలుపుకుని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది  సంక్రాంతి పండగ జనవరి 14, 15, 16 వ తేదీల్లో జరుపుకోనున్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ రోజున చేసే దానానికి,  స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఖిచ్డీని కూడా ఈ రోజున తయారు చేసి తింటారు. ఇలా చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఖిచిడీ జాతరలు కూడా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో.. మకర సంక్రాంతి రోజున.. మీరు ఇంట్లో రుచికరమైన ఖిచిడీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా.. ఈజీగా.. టేస్టీగా దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు: 

ఒక కప్పు – బియ్యం

ఇవి కూడా చదవండి

ఒక కప్పు – పెసర పప్పు

నూనె- కావలిసినంత

ఇంగువ-1/4 టీస్పూన్

జీలకర్ర-1 టీస్పూన్

అల్లం-2 అంగుళాలు

వెల్లుల్లి-6

లవంగం-2

ఉల్లిపాయ – 2

టమోటా-1

పచ్చి మిరపకాయలు-  2

కరివేపాకు

బంగాళాదుంప-2

పచ్చి బఠానీలు-1/3  కప్పు

గరం మసాలా-1 స్పూన్

కారం-1 స్పూన్

పసుపు -1 టీస్పూన్

నీరు-6 కప్పులు

నెయ్యి-రెండు స్పూన్లు

ఖిచిడీని తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పప్పు కలపాలి. తర్వాత రెండు వస్తువులను బాగా కడగాలి. ఆ తర్వాత కుక్కర్‌లో నూనె వేసి వేడి చేయాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసి.. ఇప్పుడు అందులో ఇంగువ వేయండి. (ఇది ఆహారానికి రుచితో పాటు.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.) ఇప్పుడు ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత నూనెలో అల్లం, వెల్లుల్లి వేయాలి. వాటిని కొన్ని నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ, కరివేపాకు వేయాలి. 3 నుండి 4 నిమిషాలు తక్కువ మంట మీద  వేయించాలి.  ఉల్లిపాయను లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో తరిగిన టొమాటోలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అందులో వేయాలి. ఇప్పుడు బాగా వేయించండి. అనంతరం ఈ మిశ్రమంలో 2 తరిగిన బంగాళదుంపలను వేయండి. దీన్ని కొన్ని నిమిషాలు నూనెలో వేయించండి. అనంతరం పచ్చి బఠానీలు వేసి వేయించి.. ఆ మిశ్రమంలో పసుపు, కారం,  గరం మసాలా జోడించి.. వీటిని బాగా కలపండి.

అనంతరం ఈ మిశ్రమంలో బియ్యం, పప్పు వేయాలి. మసాలా దినుసులను ఒక నిమిషం పాటు వేయించాలి. అనంతరం ఆరు కప్పుల నీటిని పోసుకుని ఉప్పు వేసి.. రుచి చూసి.. కుక్కర్ మూత పెట్టండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ ఖిచిడీ రెడీ.. ఈ కిచిడీని పెరుగు లేదా  ఊరగాయతో సర్వ్ చేయండి. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఇది మీ శరీర పోషణకు పని చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..