Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iconic Bakeries: మీరు బేకరీ ఫుడ్ ప్రియులా.. స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో స్థాపించిన బేకరీలో ట్రై చేయండి..

సాంప్రదాయ భారతీయ బేకరీలో లభించే ఆహారం రుచి.. వాసన అందరినీ ఆకర్షిస్తాయి. అయితే ఈ ఐకానిక్ బేకరీలు స్వాతంత్య్రానికి  పూర్వం నాటివి.. పుడ్ లవర్స్ ఖచ్చితంగా సందర్శించదగినవి.

Iconic Bakeries: మీరు బేకరీ ఫుడ్ ప్రియులా.. స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో స్థాపించిన బేకరీలో ట్రై చేయండి..
Pre Independence Bakeries In India
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 7:51 PM

అప్పటి కప్పుడు వండిన వంటకాలను వేడివేడిగా తినడాన్నీ అందరూ ఇష్టపడతారు. అంతకు మించిన సంతృప్తికరమైనది మరొకటి లేదు. ఇది చాక్లెట్ కేక్ లేదా పుడ్డింగ్ కావచ్చు. మరేదైనా ఆహారం కావచ్చు. మీరు ఏదైనా బేకరీ ఐటెం ని తినాలని భావిస్తే.. చాలా మంది ప్రముఖ పాశ్చాత్య బేకరీలను సందర్శించడానికి ఇష్టపడతారు. సాంప్రదాయ భారతీయ బేకరీల్లో దొరికే స్నాక్స్ లాగానే ఇక్కడ ఫుడ్ కూడా నోరూరిస్తుంది. ఈ సాంప్రదాయ భారతీయ బేకరీలు స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఉన్నాయి. మీరు స్వీట్ ఫుడ్స్ ను  ఇష్టపడే వారు అయితే.. ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలనుకుంటే.. తప్పనిసరిగా సందర్శించాల్సిన కొన్ని బేకరీలు ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు ఏర్పాటు చేసిన బేకరీలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆహార ప్రియులను అలరిస్తున్నాయి.

రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీ, మంబాలి: కేరళలోని మాంబలిలో రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీ 1880లో ప్రారంభమైంది. ఈ బేకరీ కేరళీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ బేకరీని తలస్సేరిలో మాంపల్లి బాపు స్థాపించారు. కేరళ చరిత్రలో ఇదే తొలి బేకరీ. భారతదేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్‌ను తయారు చేసిన ఘనత కూడా దీని సొంతం. బార్లీ బిస్కట్, ప్లం కేక్ నుండి సూప్ స్టిక్స్, వెజ్ పఫ్స్  సహా మరెన్నో తాజాగా కాల్చిన స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కేరళను కనుక సందర్శించాలనుకుంటే.. ఈ ఐకానిక్ బేకరీని తప్పక సందర్శించే లిస్ట్ లో చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

గ్లెనారిస్, డార్జిలింగ్: డార్జిలింగ్ లో ఈ కేక్ షాప్ బ్రిటిష్ వారి పాలనలో ప్రారభించబడింది. పూర్వం దీనిని వాడో అని పిలిచేవారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఈ బేకరీ పేరు గ్లెనెరిస్‌గా మార్చబడింది. ఈ కేఫ్ నుంచి చూస్తే.. పర్వతాలు అందంగా కనిపిస్తూ అలరిస్తాయి. లోపలి భాగం వెచ్చగా .. పూర్వ కాలాన్ని జ్ఞాపకం తెచ్చే విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా డార్జిలింగ్ ను సందర్శిస్తే,  తప్పనిసరిగా ఈ బేకరీలో అల్పాహారం శాండ్‌విచ్‌లు, కేకులు, పిజ్జా, రోల్స్‌ని తప్పకుండా ప్రయత్నించండి. అంతేకాదు ఈ బేకరీలో  ప్రసిద్ధ డార్జిలింగ్ టీని మిస్ చేసుకోకండి. ఈ బేకరీకి వెళ్లాలనుకుంటే.. నెహ్రూ రోడ్ క్లాక్ టవర్ దగ్గర, చౌక్ బజార్ దగ్గర ఉంటుంది.

View this post on Instagram

A post shared by Glenarys (@glenarys)

కాన్పెటెరియా 31 డి జనీరో, గోవా: కాన్పిటేరియా 31 డి జనేరియా.. స్వాతంత్య్రం రాక ముందు ఏర్పాటు చేసిన సాంప్రదాయక బేకరీ.  ఇది పోర్చుగీస్ బేకరీ. 1930 నుండి కాల్చిన వంటకాలను అందిస్తోంది. మీకు తాజాగా కాల్చిన వంటకాలు ఇష్టమైతే.. ఈ బేకరీ లో ఫుడ్ ని  తప్పనిసరిగా ప్రయత్నించండి.  ఈ బేకరీ పాతకాలపు వైబ్‌ని కలిగి ఉంది. పోర్చుగీస్,  స్థానిక గోవా డెజర్ట్‌లను అందిస్తుంది. దీని మెనూలోని ప్రసిద్ధ వంటకాలు స్విస్‌రోల్, డేట్ కేక్, వాల్‌నట్ కేక్ , ప్యాటీస్.

బెంగళూరు కనెక్షన్ 1888, బెంగళూరు: బెంగుళూరు కనెక్షన్ 1888ని ప్రియాంక్ సుకానంద్ స్థాపించారు. ఇది ప్రియాంక్ ముత్తాత యాజమాన్యంలోని నాయుడు బేకరీ నుండి ప్రేరణ పొంది 1888లో స్థాపించబడింది. ఈ ఐకానిక్ బేకరీలో పాత బెంగళూరు ఆహార రుచులను అందిస్తుంది. పాత రోజులను ప్రతి ఒక్కరికీ గుర్తుకు తెస్తుంది. పీనట్ బట్టర్ కుకీలు, కొబ్బరి కుకీలు, ఐరిష్ కాఫీ ట్రఫుల్స్ , బనానా కారామెల్ టీ కేక్ వారి మెనూలోని కొన్ని ప్రసిద్ధ వంటకాలు. ఎలా చేరుకోవాలంటే.. మ్యూజియం రోడ్, శాంతలా నగర్, అశోక్ నగర్ బెంగళూరు.

ఫ్లర్రీస్, కోల్‌కతా: కోల్‌కతాలోని పురాతన..  ప్రసిద్ధ బేకరీలలో ఫ్లరీస్ ఒకటి. ఇది 1927లో స్థాపించబడింది. తాజా పేస్ట్రీలు, పుడ్డింగ్‌లు, కేక్‌ల వంటి వివిధ రకాల రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బేకరీని సందర్శించిన వారు బాదం పేస్ట్రీ, బాబా కేక్, వియన్నా కాఫీ , మోచాచినో కాఫీ ని తప్పక ప్రయత్నించండి.

వెంగర్స్, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఈ బేకరీ 1926లో స్థాపించబడింది. న్యూఢిల్లీలో అత్యంత ప్రసిద్ధ బేకరీలలో ఒకటి. ఇక్కడ స్విస్ తరహా స్వీట్స్ స్పెషల్ గా నిలిచాయి. స్విస్-శైలి పాటిస్సేరీ , రుచికరమైన స్నాక్స్‌లను అందిస్తుంది, చాక్లెట్ స్విస్ రోల్, మటన్ పఫ్, మోచా పేస్టీ, మార్జిఫాన్ , వెజ్ బంగెట్  ఈ బేకరీ మెనూలో ప్రసిద్ధ వంటకాలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..