Gongura Chicken Biryani: నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే ఆంధ్రా స్పెషల్ వంటకం.. గోంగూర బిర్యానీ రెసిపీ మీ కోసం

గోంగూరతో పచ్చడి, కూర వంటి కూరలు మాత్రమే కాదు.. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేస్తారు. పుల్ల పుల్లగా ఉండి.. నోరికి రుచిగా అనిపిస్తూ.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీ..

Gongura Chicken Biryani: నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే ఆంధ్రా స్పెషల్ వంటకం.. గోంగూర బిర్యానీ రెసిపీ మీ కోసం
Gongura Chicken Biryani
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2022 | 6:37 PM

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటి బిర్యానీ. ప్రతి ఒక్కరి ఫేవరేట్ డిషెస్ లిస్ట్ లో బిర్యానీ తప్పనిసరిగా ఉంటుంది. బిర్యానీలో ఎన్ని రకాలున్నాయా.. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేక వేరు.. అదే విధంగా ఆంధ్రా వంటల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలతో పాటు.. గొంగురుతో చేసే వంటలు కూడా భోజన ప్రియులను ఆకట్టుకుంటాయి. గోంగూరతో పచ్చడి, కూర వంటి కూరలు మాత్రమే కాదు.. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేస్తారు. పుల్ల పుల్లగా ఉండి.. నోరికి రుచిగా అనిపిస్తూ.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీ.. ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రాస్టైల్ లో నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

బోన్ లెస్ చికెన్ – 1/2 కేజీ

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి

అల్లం వెల్లుల్లి పేస్ట్

టొమాటో – ప్యూరీ

గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు)

కారం – 2 టీస్పూన్

పసుపు – చిటికెడు

ఉప్పు- రుచికి సరిపడా..

నూనె – తయారీకి సరిపడా

నీరు – ఒక కప్పు

మసాలా పొడి

తయారీ విధానం: ఈ బిర్యానీ చేయడానికి ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించండి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు, టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంట మీద వేగించండి. ఎముకలు లేని చికెన్ ముక్కలు వేసి చిన్న మంట మీద కొంచెం సేపు ఉడికించండి..ఇప్పుడు కొంచెం కారం, పసుపు వేసి తర్వాత కొంచెం నీరు జోడించండి.. పాన్ మీద మూత  పెట్టి..  అది సుమారు 10-15 నిమిషాలు ఉడికించాలి. మూత తెరిచి.. మసాలా పొడి వేయండి.. బాగా కలపండి, ఉప్పు వేసి గోంగూర చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

బాస్మతి రైస్ – 750 గ్రాములు

నిలువగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు వేయించుకోవాలి

జీడిపప్పు

కుంకుమపువ్వు – కొంచెం

రోజ్ వాటర్

పచ్చిమిర్చి – 8 నుంచి 10

పుదీనా ఆకులు – 1 టీస్పూన్

కొత్తిమీర

ఉప్పు రుచికి సరిపడా

గోంగూర చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమంలో ఈ ఉడికిన బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అనంతరం నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి.. చివరిగా ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. ఉప్పు చూసుకోవాలి. అనంతరం మూత పెట్టి.. తక్కువ మంటపై 20 నిమిషాల పాటు దమ్ లో ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..