Men Health: మగ మహారాజులకు షేకింగ్ న్యూస్.. ఇవి తింటే పిల్లలు పుట్టడం చాలా కష్టమట..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాదని ఏది పడితే అది తినడం, కనీసం శారీరక శ్రమ లేకుండా ఉండటం వల్ల

Men Health: మగ మహారాజులకు షేకింగ్ న్యూస్.. ఇవి తింటే పిల్లలు పుట్టడం చాలా కష్టమట..!
Men Health
Follow us

|

Updated on: Jan 08, 2023 | 9:02 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాదని ఏది పడితే అది తినడం, కనీసం శారీరక శ్రమ లేకుండా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బరువు పెరగడం, స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి పెరుగుతాయి. వీటి కారణంగా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఫలితంగా మరింత కుంగిపోతారు. అయితే, ప్రస్తుత కాలంలో యువత సైతం ఇలాంటి అనారోగ్యానికి గురవుతున్నారు. మూడు పదుల వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. అంతకంటే ప్రమాదకరం ఏంటంటే.. యుక్తవయస్సులోనే లైంగిక శక్తిని కోల్పోతారు. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. చెడు జీవన శైలి కారణంగా పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా వివాహం అనంతరం సంతానం కలుగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, తినే ఆహారంపై, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల పురుషుల్లో వీర్యం ఉత్తత్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పట్టించుకోని పురుషులు..

గత 40 ఏళ్లుగా సగటు పురుషుడి స్పెర్మ్ కౌంట్ క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వాస్తవం అందరినీ తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. అయినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మనం తినే ఆహారమే వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుందని తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు.

స్పెర్మ్ నాణ్యత తగ్గుతోంది..

స్పెర్మ్ నాణ్యతలో తగ్గుదల అనేది అతిపెద్ద సమస్య. గత 38 ఏళ్లలో సగటు స్పెర్మ్ కౌంట్ 59 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్పెర్మ్ కౌంట్ పడిపోవడం వల్ల చాలామంది దంపతులు సంతానం కలుగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కారణం ఏంటి?

స్పెర్మ్ కౌంట్ ఎందుకు అంత త్వరగా తగ్గిపోతుందో ఎవరికీ తెలియదు. ల్యాప్‌టాప్‌లను తమ ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబితే.. ప్యాంటు జేబులో పెట్టుకునే సెల్‌ఫోన్‌ల వల్ల అని మరికొందరు అంటుంటారు. అతిగా మద్యం సేవించడం, ఊబకాయం ఒక కారణమని కూడా కొందరు చెబుతారు.

ఆహారం స్పెర్మ్‌ను చంపుతుందా?

స్పెర్మ్ నాణ్యత, కౌంట్‌ తగ్గుదలకి అనేక కారణాలు ఉన్నాయి. అయితే తినే ఆహారం కూడా శుక్ర కణాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ఆహారాలు తినడం వల్ల స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది. అదే సమయంలో స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి.

తినకూడని ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రాసెస్ చేసిన మాంసాలు..

ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం వల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో మేక, గొడ్డు మాంసం, పంది మాంసం ఉన్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్..

ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. అలాగే, 2011 స్పానిష్ అధ్యయనం ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు తేలింది.

సోయా ఉత్పత్తులు..

సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్, ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇరాన్‌లోని బోస్టన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకునేవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గినట్లు తేలింది.

పెస్టిసైడ్స్ అధికంగా వాడిని కూరగాయలు..

నేరుగా పెస్టిసైడ్స్ తీసుకోకున్నప్పటికీ.. వాటిని అధికంగా వినియోగించి పండిస్తున్న పంటలను తినడం వలన వాటి ప్రభావం మనుషులపై పడుతోంది. వీటి వలన మనకు అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది స్పెర్మ్ కౌంటర్ తగ్గిస్తుంది.

అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు..

పాలు, క్రీమ్, జున్ను ఇష్టపడే వారైతే.. మీ అలవాట్లను తక్షణమే మార్చుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫుల్ ఫ్యాట్ పాలలో ఈస్ట్రోజెన్ ఉంటుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు ఇచ్చే స్టెరాయిడ్స్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం మానేసి బాదం పాలు, తక్కువ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

మద్యం..

అబ్బాయిలు, మద్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అతిగా మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ వినియోగం సెక్స్ డ్రైవ్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుంది. కంటిన్యూగా మద్యం తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. అందుకే.. కొంచెం జాగ్రత్తగా ఉండి.. మంచి ఆహారాలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?